ఫిష్ ఆంధ్ర పథకంపై విజిలెన్స
ABN , Publish Date - Mar 14 , 2025 | 11:17 PM
గత వైసీపీ ప్రభుత్వంలో మత్స్య కార్మికుల జీవనోపాధిని మెరుగుపరిచేందు కోసం అమలు చేసిన ఫిష్ ఆంధ్ర పథకం అమలులోని అవినీతి మీద పూర్తి స్థాయి విజిలెన్స విచారణకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయనున్నట్లు ఉమ్మడి జిల్లా మత్స్య సహకార సంఘం యూనియన చైర్మన నవీన కుమార్ తెలిపారు.

మత్స్య సహకార సంఘం జిల్లా చైర్మన నవీన కుమార్
కర్నూలు అగ్రికల్చర్, మార్చి 14 (ఆంధ్రజ్యోతి): గత వైసీపీ ప్రభుత్వంలో మత్స్య కార్మికుల జీవనోపాధిని మెరుగుపరిచేందు కోసం అమలు చేసిన ఫిష్ ఆంధ్ర పథకం అమలులోని అవినీతి మీద పూర్తి స్థాయి విజిలెన్స విచారణకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయనున్నట్లు ఉమ్మడి జిల్లా మత్స్య సహకార సంఘం యూనియన చైర్మన నవీన కుమార్ తెలిపారు. శుక్రవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 7,600 ఫిష్ ఆంధ్ర యూనిట్లను చేపల వేట కొనసాగించే నిరుద్యోగ యువకుల కోసం అమలు చేసినట్లు తెలిపారు. కేంద్రం అందించిన రూ.56 కోట్లతో ఆనాటి వైసీపీ ప్రభుత్వం ఫిష్ ఆంధ్ర పథకాన్ని మొదలు పెట్టిందని, అయితే.. ప్రస్తుతం ఆ యూనిట్ల జాడ ఎక్కడా కనిపించడం లేదన్నారు. యూనిట్ల పరికరాలను అధికారులు, నాయకులు తాము చెప్పిన కంపెనీల నుంచి కొనుగోలు చేయాలని ఒత్తిడి చేశారని, ఈ వ్యవహారంలో భారీ ఎత్తున నిధులు దుర్వినియోగం అయ్యాయని ఆరోపించారు. త్వరలో ఈ విషయం మీద విచారణ చేయాలని ప్రభుత్వానికి ఫిర్యాదు చేయనున్నట్లు నవీన కుమార్ తెలిపారు.