Share News

JAC Chairman Vidyasagar: పీఆర్సీ కమిటీని తక్షణమే నియమించాలి

ABN , Publish Date - Jul 22 , 2025 | 05:49 AM

పీఆర్సీ కమిటీని వెంటనే నియమించాలని ఏపీఎన్జీజీఓ రాష్ట్ర అధ్యక్షుడు, జేఏసీ చైర్మన్‌ విద్యాసాగర్‌ డిమాండ్‌ చేశారు.

JAC Chairman  Vidyasagar: పీఆర్సీ కమిటీని తక్షణమే నియమించాలి

  • పెండింగ్‌ డీఏలు మంజూరు చేయాలి

  • ఏపీఎన్జీజీఓ అధ్యక్షుడు విద్యాసాగర్‌ డిమాండ్‌

విజయవాడ, జూలై 21(ఆంధ్రజ్యోతి): పీఆర్సీ కమిటీని వెంటనే నియమించాలని ఏపీఎన్జీజీఓ రాష్ట్ర అధ్యక్షుడు, జేఏసీ చైర్మన్‌ విద్యాసాగర్‌ డిమాండ్‌ చేశారు. సోమవారం సీఎస్‌ విజయానంద్‌కు లేఖ అందజేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. వేతన సవరణ రెండేళ్లు ఆలస్యమైందని, వెంటనే వేతన సవరణ కమిషనర్‌ను నియమించి ప్రక్రియను ప్రారంభించాలన్నారు. పెండింగ్‌లో ఉన్న మూడు డీఏల్లో రెండింటినైనా మంజూరు చేయాలని కోరారు. 2019-24 మధ్య ఉద్యోగులపై నమోదైన పెండింగ్‌ కేసులన్నింటినీ ఎత్తేసి, రిలీఫ్‌ ఫండ్‌ చెల్లించాలని కోరారు. 2004కు ముందు నోటిఫికేషన్‌ ద్వారా నియమితులైన ఉద్యోగులకు ఓపీఎస్‌ వర్తింపు, గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు నోషనల్‌ ఇంక్రిమెంట్లు విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. సానుకూలంగా స్పందించిన సీఎస్‌ విజయానంద్‌.. స్టాఫ్‌ కమిటీ ఏర్పాటుకు ముందు కార్యాచరణ జరిపి, కౌన్సిల్‌ సమావేశం ఏర్పాటు చేయాలని సూచించనట్టు తెలిపారు.

Updated Date - Jul 22 , 2025 | 05:49 AM