Share News

CP Radhakrishnan: ఎల్లుండి విజయవాడకు ఉప రాష్ట్రపతి

ABN , Publish Date - Sep 22 , 2025 | 04:26 AM

భారత ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌ ఈ నెల 24న విజయవాడ రానున్నట్టు తెలిసింది. దసరా శరన్నవరాత్రుల సందర్భంగా ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న...

CP Radhakrishnan: ఎల్లుండి విజయవాడకు ఉప రాష్ట్రపతి

విజయవాడ సిటీ, సెప్టెంబరు 21(ఆంధ్రజ్యోతి): భారత ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌ ఈ నెల 24న విజయవాడ రానున్నట్టు తెలిసింది. దసరా శరన్నవరాత్రుల సందర్భంగా ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న కనక దుర్గమ్మను ఆయన దర్శించుకుంటారు. అనంతరం, భవానీపురంలోని పున్నమి ఘాట్‌లో జరిగే ‘విజయవాడ ఉత్సవ్‌’లో పాల్గొంటారు. ఈ నెల 20న విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్‌ ఢిల్లీలో ఉప రాష్ట్రపతిని కలిసి శరన్నవరాత్రులు సహా విజయవాడ ఉత్సవ్‌కు సంబంధించిన ఆహ్వాన పత్రికను ఆయనకు అందించారు. ఈ నేపథ్యంలో రాధాకృష్ణన్‌ బుధవారం విజయవాడ పర్యటనకు వస్తారని ఎంపీ కార్యాలయం తెలిపింది.

Updated Date - Sep 22 , 2025 | 04:26 AM