Department of Higher Education: ఐదు విశ్వవిద్యాలయాలకు వీసీల నియామకం
ABN , Publish Date - Oct 09 , 2025 | 05:01 AM
రాష్ట్రంలో ఐదు విశ్వవిద్యాలయాలకు ఉప కులపతులను నియమిస్తూ ఉన్నత విద్యాశాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.
ఏఎన్‌యూకు వెంకట సత్యనారాయణ రాజు
అమరావతి, అక్టోబరు 8(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఐదు విశ్వవిద్యాలయాలకు ఉప కులపతులను నియమిస్తూ ఉన్నత విద్యాశాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం ఆచార్యుడు ఎస్ వెంకట సత్యనారాయణరాజును ఏఎన్‌యూ వీసీగా నియమించింది. హైదరాబాద్ ఐఐటీ ఆచార్యుడు తాతా నర్సింగరావును ఎస్వీయూ వీసీగా నియమించింది. హైదరాబాద్ యూనివర్సిటీ ప్రొఫెసర్ రాజశేఖర్ బెల్లంకొండను యోగి వేమన యూనివర్సిటీ వీసీగా నియమించింది. జేఎన్‌టీయూ కాకినాడ మెకానికల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్ వీ వెంకట సుబ్బారావును జేఎన్‌టీయూ-గురజాడ వీసీగా నియమించింది. యోగి వేమన వర్సిటీ స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ ఆచార్యుడు బి.జయరామిరెడ్డిని వైఎ్‌సఆర్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ వీసీగా నియమించింది. కాగా రాష్ట్రంలో ఇంకా నాలుగు విశ్వవిద్యాలయాల ఉప కులపతుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి.