Share News

Naval Command: తూర్పు నౌకాదళం కమాండింగ్‌-ఇన్‌-చీఫ్‌గా సంజయ్‌ భల్లా

ABN , Publish Date - Nov 01 , 2025 | 04:21 AM

తూర్పు నౌకాదళం ఫ్లాగ్‌ ఆఫీసర్‌ కమాండింగ్‌-ఇన్‌-చీఫ్‌గా వైస్‌ అడ్మిరల్‌ సంజయ్‌ భల్లా శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుత చీఫ్‌ వైస్‌ అడ్మిరల్‌ రాజేశ్‌ పెంఢార్కర్‌...

Naval Command: తూర్పు నౌకాదళం కమాండింగ్‌-ఇన్‌-చీఫ్‌గా సంజయ్‌ భల్లా

విశాఖపట్నం, అక్టోబరు 31(ఆంధ్రజ్యోతి): తూర్పు నౌకాదళం ఫ్లాగ్‌ ఆఫీసర్‌ కమాండింగ్‌-ఇన్‌-చీఫ్‌గా వైస్‌ అడ్మిరల్‌ సంజయ్‌ భల్లా శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుత చీఫ్‌ వైస్‌ అడ్మిరల్‌ రాజేశ్‌ పెంఢార్కర్‌ శుక్రవారం పదవీ విరమణ చేయనుండడంతో భల్లాను నియమించారు. ఐఎన్‌ఎస్‌ సర్కార్స్‌ మైదానంలో కొత్త దళాధిపతి సంజయ్‌ భల్లా సైనిక వందనం స్వీకరించి నేవీ దళాలను సమీక్షించారు. విశాఖపట్నం కేంద్రంగా పనిచేస్తున్న ఫ్లాగ్‌ ఆఫీసర్లు, వివిధ విభాగాలకు బాధ్యత వహిస్తున్న కమాండింగ్‌ అధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. సంజయ్‌ భల్లా 1989 జనవరిలో నేవీలో తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఈ 36 ఏళ్ల సర్వీసులో ఆయన అనేక బాధ్యతలు నిర్వర్తించారు. కమ్యూనికేషన్‌, ఎలక్ర్టానిక్‌ వార్‌ఫేర్‌లో ప్రత్యేక కోర్సు చేసిన తరువాత ఆయన పలు ఫ్రంట్‌లైన్‌ యుద్ధనౌకల్లో నిపుణుడిగా వ్యవహరించారు. 2022లో నిర్వహించిన ప్రెసిడెంట్‌ ఫ్లీట్‌ రివ్యూ, మిలాన్‌లలో టాక్టికల్‌ కమాండ్‌ అధికారిగా బాధ్యతలు నిర్వహించారు. ఇక్కడ బాధ్యతలు చేపట్టడానికి ముందు నేవల్‌ హెడ్‌ క్వార్టర్స్‌లో చీఫ్‌ ఆఫ్‌ పర్సనల్‌గా పనిచేశారు. ఆయన సేవలకు అతి విశిష్ఠ సేవా మెడల్‌, నౌ సేనా మెడల్‌ను ప్రభుత్వం బహూకరించింది.

Updated Date - Nov 01 , 2025 | 04:22 AM