Share News

Animal Husbandry Department: వెటర్నరీ ఉద్యోగులకు అవార్డులు

ABN , Publish Date - Aug 21 , 2025 | 05:58 AM

రాష్ట్ర పశు సంవర్ధక శాఖలోని వివిధ విభాగాల్లో ఉత్తమ పనితీరు కనబర్చిన 67 మంది ఉద్యోగులను స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ..

Animal Husbandry Department: వెటర్నరీ ఉద్యోగులకు అవార్డులు

అమరావతి, ఆగస్టు 20(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర పశు సంవర్ధక శాఖలోని వివిధ విభాగాల్లో ఉత్తమ పనితీరు కనబర్చిన 67 మంది ఉద్యోగులను స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఉత్తమ అవార్డులకు ఎంపిక చేశారు. వీరికి బుధవారం విజయవాడలోని పశుసంవర్ధకశాఖ ప్రధాన కార్యాలయంలో డైరెక్టర్‌ దామోదర్‌నాయుడు అవార్డులు అందజేశారు. జాయింట్‌ డైరెక్టర్‌ చెన్నయ్య, జిల్లా పశుసంవర్ధక అధికారులు రవికుమార్‌ (తిరుపతి), మన్మథరావు (మన్యం), నరసింహులు (కృష్ణా), డిప్యూటీ డైరెక్టర్లు శ్రీలక్ష్మి(చిత్తూరు) హుస్సేన్‌ (పశ్చిమగోదావరి), చంద్రశేఖర్‌(విశాఖపట్నం), జగత్‌ శ్రీనివాసు(ప్రకాశం), దుర్గాప్రసన్నబాబు (కర్నూలు), ఏడుగురు అసిస్టెంట్‌ డైరెక్టర్లు, 8మంది పశువైద్య సహాయ శస్త్రచికిత్సకులు తదితర ఉద్యోగులను శాలువాలతో సత్కరించి, అవార్డులు అందజేశారు.

Updated Date - Aug 21 , 2025 | 05:58 AM