SIT Investigation: మద్యం కేసులో సీజ్ చేసిన కార్లపై 16న తీర్పు
ABN , Publish Date - Dec 10 , 2025 | 06:33 AM
మద్యం కుంభకోణంలో ప్రధా న నిందితుడు కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డిని అరెస్టు చేసినప్పుడు సిట్ అధికారులు సీజ్ చేసిన కారుల...
రగ్గు, దిండు ఇప్పించాలని అనిల్ చోఖ్రా పిటిషన్
విజయవాడ, డిసెంబరు 9(ఆంధ్రజ్యోతి): మద్యం కుంభకోణంలో ప్రధా న నిందితుడు కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డిని అరెస్టు చేసినప్పుడు సిట్ అధికారులు సీజ్ చేసిన కారుల విడుదలపై విజయవాడ ఏసీబీ కోర్టు 16న తీర్పు ఇవ్వనుంది. సిట్ అధికారులు రాజశేఖర్‌రెడ్డిని అరెస్టు చేసినప్పుడు రెండు కారులను సీజ్ చేసింది. ఆ కారులు తమ కంపెనీకి చెందినవని ఇస్పాత్ కంపెనీ కొద్దిరోజుల క్రితం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. వాటిని విడుదల చేయడానికి ఆదేశాలు ఇవ్వాలని అభ్యర్థించింది. దీనిపై మంగళవారం వాదనలు ముగిశాయి. జైల్లో ఉన్న తనకు దిండు, రగ్గు ఇప్పించాలని అనిల్ చోఖ్రా ఏసీబీ కోర్టులో మంగళవారం పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ప్రాసిక్యూషన్, జైలు అధికారులకు నోటీసులు ఇవ్వాలని ఆదేశిస్తూ విచారణను జడ్జి పి.భాస్కరరావు గురువారానికి వాయిదా వేశారు.