Share News

Liquor Scam Case: వెంకటేశ్‌ నాయుడు బెయిల్‌పై విచారణ వాయిదా

ABN , Publish Date - Dec 23 , 2025 | 05:49 AM

మద్యం కుంభకోణం కేసులో బెయిల్‌ మంజూరుచేయాలని కోరుతూ నిందితుడు వెంకటేష్‌ నాయుడు(ఏ34) దాఖలు చేసిన పిటిషన్‌ సోమవారం హైకోర్టులో విచారణకు వచ్చింది.

Liquor Scam Case: వెంకటేశ్‌ నాయుడు బెయిల్‌పై విచారణ వాయిదా

అమరావతి, డిసెంబరు 22(ఆంధ్రజ్యోతి): మద్యం కుంభకోణం కేసులో బెయిల్‌ మంజూరుచేయాలని కోరుతూ నిందితుడు వెంకటేష్‌ నాయుడు(ఏ34) దాఖలు చేసిన పిటిషన్‌ సోమవారం హైకోర్టులో విచారణకు వచ్చింది. దీనిపై అసిస్టెంట్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ ప్రియాంక స్పందిస్తూ... వ్యాజ్యం మొదటిసారి విచారణకు వచ్చిందన్నారు. వివరాలు తెప్పించుకొని వాదనలు వినిపించేందుకు సమయమివ్వాలని కోరారు. పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ వెంకట జ్యోతిర్మయి కౌంటర్‌ దాఖలు చేయాలని సిట్‌ను ఆదేశిస్తూ విచారణను ఈ నెల 30కి వాయిదా వేశారు.

Updated Date - Dec 23 , 2025 | 05:52 AM