Festival Season: పండుగ వేళ సరికొత్త డిజైన్లతో వేగ జ్యువెలర్స్ సిద్ధం
ABN , Publish Date - Sep 11 , 2025 | 06:46 AM
దసరా, దీపావళి పండుగలకు, వివాహ వేడుకలకు సరికొత్త డిజైన్‌లను అందించేందుకు వేగ జ్యువెలర్స్ సిద్ధంగా ఉందని సంస్థ చైర్మన్ బండ్లమూరి రామ్మోహన్, మేనేజింగ్ డైరక్టర్ నవీన్ వనమా తెలిపారు.
43వ వార్షిక నివేదిక ఆవిష్కరించిన బాలకృష్ణ
విజయవాడ సిటీ, సెప్టెంబరు 10 (ఆంధ్రజ్యోతి): దసరా, దీపావళి పండుగలకు, వివాహ వేడుకలకు సరికొత్త డిజైన్‌లను అందించేందుకు వేగ జ్యువెలర్స్ సిద్ధంగా ఉందని సంస్థ చైర్మన్ బండ్లమూరి రామ్మోహన్, మేనేజింగ్ డైరక్టర్ నవీన్ వనమా తెలిపారు. వేగ జ్యువెలర్స్ 43వ వార్షిక నివేదికను సంస్థ బ్రాండ్ అంబాసిడర్ నందమూరి బాలకృష్ణ ముంబయిలోని కార్యాలయంలో బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రామ్మోహన్, నవీన్ మాట్లాడుతూ.. ఏపీ, తెలంగాణలో ఖాతాదారుల అభిమానాన్ని చూరగొన్నామన్నారు. అధిక సంఖ్యలో ఉన్న తమ ఖాతాదారుల కోసం సరికొత్త డిజైన్‌లను అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు. పండుగ సీజన్‌లలో ప్రత్యేక ఆఫర్లను ప్రకటిస్తామని, ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పాత నగల మార్పిడిపై ఆకర్షణీయమైన విలువ కట్టడమే కాకుండా ప్రత్యేక ధరలను డైమండ్ క్యారెట్‌పై అందిస్తున్నట్టు వెల్లడించారు. కస్టమర్లకు లాభం చేకూర్చేలా వివిధ రకాల ఆభరణాల కొనుగోలు పథకాలు తమ స్టోర్స్‌లో ఉన్నాయని తెలిపారు.