Share News

Vijayawada: వేగా జ్యూయలర్స్‌లో ప్రత్యేక ఆఫర్లు

ABN , Publish Date - Dec 14 , 2025 | 04:50 AM

రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు చేరువైన ప్రముఖ బంగారు ఆభరణాల షోరూం వేగా జ్యూయలర్స్‌ పండుగల ప్రారంభ శుభవేళ...

Vijayawada: వేగా జ్యూయలర్స్‌లో ప్రత్యేక ఆఫర్లు

  • బంగారు ఆభరణాల తరుగుపై 50శాతం తగ్గింపు

విజయవాడ, డిసెంబరు 13(ఆంధ్రజ్యోతి): రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు చేరువైన ప్రముఖ బంగారు ఆభరణాల షోరూం వేగా జ్యూయలర్స్‌ పండుగల ప్రారంభ శుభవేళ అద్భుతమైన పలు ఆఫర్లను శనివారం ప్రకటించింది. ఈ ఆఫర్ల బ్రోచర్‌ను మిరాయ్‌ సినిమా ఫేమ్‌ రితిక నాయక్‌ విజయవాడ షోరూంలో ఆవిష్కరించారు. ఈ ప్రత్యేక ఆఫర్లు వేగా జ్యుయలర్స్‌ అన్ని షోరూంలలో ఈ నెల 15వ తేదీ నుంచి అందుబాటులో ఉంటాయి. రానున్న ధనుర్మాసం, క్రిస్మస్‌, న్యూఇయర్‌, సంక్రాంతి పర్వదినాలను మరింత వైభవంగా, ఆనందంగా జరుపుకోవడానికి సువర్ణావకాశం కల్పించాలనే లక్ష్యంతో ఈ ప్రత్యేక ఆఫర్లను ప్రవేశపెట్టినట్టు నిర్వాహకులు చెప్పారు. అన్ని రకాల అత్యాధునిక ఫ్యాషన్‌ ఆభరణాల నుంచి ప్రాచీన సంప్రదాయ ఆభరణాలు వరకు తమ అన్ని షోరూంలలో అందుబాటులో ఉంచినట్టు తెలియచేసారు. ఈ ప్రత్యేక ఆఫర్లు సందర్భంగా బంగారు ఆభరణాల తరుగుపై 50ు తగ్గింపు ఇస్తున్నట్టు వెల్లడించారు. అంతేకాక పోల్కి ఆభరణాల పైన తయారీ, తరుగు చార్జీలు ఉండవని తెలిపారు. వజ్రాభరణాల క్యారట్‌ ధర కేవలం రూ.49,999 మాత్రమే ఉంటుందని, పరిమిత కాలం మాత్రమే ఉండే ఈ అద్భుతమైన ఆఫర్లను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Updated Date - Dec 14 , 2025 | 04:51 AM