జగన్‌కు తెలిసే పరకామణి చోరీ: వర్ల
ABN , Publish Date - Dec 05 , 2025 | 04:10 AM
పరకామణి కేసుపై జగన్ మాట్లాడింది చూస్తే చోరీ వ్యవహారం, అందులో భూమన, వైవీ సుబ్బారెడ్డి పాత్ర అంతా జగన్‌కు తెలిసే జరిగినట్లు అనిపిస్తోందని...
అమరావతి, డిసెంబరు 4 (ఆంధ్రజ్యోతి): పరకామణి కేసుపై జగన్ మాట్లాడింది చూస్తే చోరీ వ్యవహారం, అందులో భూమన, వైవీ సుబ్బారెడ్డి పాత్ర అంతా జగన్‌కు తెలిసే జరిగినట్లు అనిపిస్తోందని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య అన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. వెంకన్న సొమ్ము దోచేసిన రవికుమార్, తాను దొంగలించిన సొత్తులో రూ.14.5 కోట్లు తిరిగి స్వామి వారికి గిఫ్ట్‌గా రాస్తే, చంద్రబాబు ఎప్పుడైనా స్వామి వారికి అలా ఇచ్చారా అని జగన్ అనడం అతడి పిచ్చివాగుడుకు నిదర్శనమని వ్యాఖ్యానించారు.