Grand Opening: విజయవాడలో వారాహి సిల్క్స్ షోరూం
ABN , Publish Date - Dec 05 , 2025 | 06:15 AM
దక్షిణ భారతదేశంలోనే అతి పెద్ద వస్త్ర నందనం వారాహి సిల్క్స్ ఐదో షోరూంను విజయవాడలో గురువారం ప్రారంభమైంది.
ప్రారంభించిన సినీ హీరో తేజ సజ్జా, హీరోయిన్ మీనాక్షి చౌదరి
విజయవాడ, డిసెంబరు 4(ఆంధ్రజ్యోతి): దక్షిణ భారతదేశంలోనే అతి పెద్ద వస్త్ర నందనం వారాహి సిల్క్స్ ఐదో షోరూంను విజయవాడలో గురువారం ప్రారంభమైంది. ఎంజీ రోడ్‌లో సువిశాల ప్రాంగణంలో నెలకొల్పిన షోరూంను సినీ హీరో తేజ సజ్జా, హీరోయిన్ మీనాక్షి చౌదరి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారాహి సిల్క్స్ మేనేజింగ్ డైరెక్టర్లు మణిదీప్ యేచూరి, డాక్టర్ స్పందన మద్దుల మాట్లాడుతూ.. విజయవాడ వస్త్ర ప్రపంచంలోకి అడుగుపెట్టడం తమకు ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. సంప్రదాయ, ఆధునిక ఫ్యాషన్ వస్త్రాలకు వారాహి సిల్క్స్ వారధిగా నిలుస్తుందని చెప్పారు. షోరూం ప్రారంభోత్సవం సందర్భంగా ఖాతాదారులకు ప్రత్యేక ఆఫర్లను అందిస్తున్నామని, రూ.10 వేలు కొనుగోలుపై బంగారు నాణెం, రూ.15 వేలు కొనుగోలుపై బంగారం, వెండి ఉచితంగా అందిస్తామని తెలిపారు. వీటితో పాటు రూ.1500 విలువైన ఓచర్ కూడా ఇస్తున్నామని చెప్పారు. ఈ ప్రత్యేక ఆఫర్ విజయవాడ షోరూంలో ఈ నెల 14వ తేదీ వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని వెల్లడించారు. షోరూం ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని లక్కీడ్రా నిర్వహిస్తున్నారు. మొదటి రోజు నిర్వహించిన లక్కీడ్రాలో గెలుపొందిన విజేతలకు ఐఫోన్లు బహుకరించారు. లక్కీ డ్రా విజేతలకు మొదటి బహుమతిగా ఐఫోన్లు, ద్వితీయ బహుమతిగా 500 గ్రాముల వెండి అందిస్తున్నట్టు నిర్వాహకులు తెలిపారు.