VAPCOS Report: బనకచర్లకు వాడేది వరద జలాలే
ABN , Publish Date - Jul 11 , 2025 | 03:15 AM
పోలవరం- బనరచర్ల రెగ్యులేటర్ అనుసంధన పథకానికి వినియోగించే 200 టీఎంసీలు గోదావరి వరద జలాలేనని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ వాప్కోస్ గణాంకాలతో సహా తేల్చి చెప్పింది.
రాష్ట్ర జల వనరుల శాఖకు వాప్కోస్ నివేదిక
నేడు జలశక్తి శాఖకు, జల సంఘానికి అందజేత
పోలవరం- బనరచర్ల రెగ్యులేటర్ అనుసంధన పథకానికి వినియోగించే 200 టీఎంసీలు గోదావరి వరద జలాలేనని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ వాప్కోస్ గణాంకాలతో సహా తేల్చి చెప్పింది. నదీ జలాల కేటాయింపులు, ట్రైబ్యునల్ ఆదేశాలు తదితర అంశాలు పరిశీలించిన తర్వాత రూపొందించిన సమగ్ర నివేదికను గురువారం రాత్రి రాష్ట్ర జల వనరుల శాఖ సలహాదారు ఎం. వెంకటేశ్వరరావుకు అందజేసింది. ఈ నివేదికను క్షుణ్నంగా అధ్యయనం చేసే బాధ్యతలను ఆయన ఇంజనీరింగ్ అధికారులకు అప్పగించారు. వాప్కోస్ నివేదికపై జల వనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి. సాయిప్రసాద్‌తో చర్చించాలని భావించారు. అయితే సీఎం చంద్రబాబుతో ఆయన సమావేశమైన నేపథ్యంలో అది సాధ్యపడలేదు. ఇంజనీరింగ్ అధికారుల అధ్యయనం పూర్తయిన తర్వాత శుక్రవారం సాయిప్రసాద్ ఈ నివేదికపై తన అభిప్రాయాన్ని చెప్పనున్నారు. తర్వాత దీనిని కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖకు, కేంద్ర జల సంఘానికి పంపుతారు.