Share News

Deputy CM Pawan: వందేమాతరానికి 150 ఏళ్లు

ABN , Publish Date - Nov 07 , 2025 | 05:06 AM

స్వాతంత్య్ర పోరాటంలో కశ్మీరు నుంచి కన్యాకుమారి వరకూ రణనినాదంలా నిలిచిన గేయం ‘వందేమాతరం’ అని జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ కొనియాడారు.

Deputy CM Pawan: వందేమాతరానికి 150 ఏళ్లు

నేడు 10 గంటలకు గేయాన్ని ఆలపిద్దాం: పవన్‌

అమరావతి, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి): స్వాతంత్య్ర పోరాటంలో కశ్మీరు నుంచి కన్యాకుమారి వరకూ రణనినాదంలా నిలిచిన గేయం ‘వందేమాతరం’ అని జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ కొనియాడారు. ఈ గేయం శుక్రవారం నాటికి 150 ఏళ్లు పూర్తి చేసుకుంటుందని తెలిపారు. బంకిమ్‌ చంద్ర చటర్జీ రాసిన ఈ గేయం యావత్‌ దేశాన్ని ఉద్యమ స్ఫూర్తితో నడిపించిందని, స్వతంత్ర సమరయోధులకు మనోబలాన్ని ఇచ్చిందని అన్నారు. వందేమాతరం గురించి భావితరాలకు ఘనంగా తెలియజేయాలని, దేశవ్యాప్తంగా నిర్దేశిత సమయంలో ప్రజలందరూ ఈ గేయాన్ని ఆలపించాలని మోదీ ప్రభుత్వం నిర్ణయించిందని వివరించారు. ‘శుక్రవారం ఉదయం 10 గంటలకు ప్రతి ఒక్కరం ఈ గేయాన్ని ఆలపిద్దాం. దీని స్ఫూర్తిని భావితరాలకు అందించే బాధ్యత మనందరిదీ’ అని పిలుపునిచ్చారు.

Updated Date - Nov 07 , 2025 | 05:06 AM