Share News

Vijayawada Railway Division: నరసాపూర్‌-ఎంజీఆర్‌ చెన్నై సెంట్రల్‌ మధ్య వందేభారత్‌

ABN , Publish Date - Dec 14 , 2025 | 04:58 AM

నరసాపూర్‌-ఎంజీఆర్‌ చెన్నై సెంట్రల్‌ వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ను ఈ నెల 15వ తేదీ మధ్యాహ్నాం 1.30 గంటలకు కేంద్ర పారిశ్రామిక ఉక్కు శాఖల సహాయ మంత్రి భూపతిరాజు...

Vijayawada Railway Division: నరసాపూర్‌-ఎంజీఆర్‌ చెన్నై సెంట్రల్‌ మధ్య వందేభారత్‌

  • 15న ప్రారంభించనున్న కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాసవర్మ

విజయవాడ, డిసెంబరు 13 (ఆంధ్రజ్యోతి): నరసాపూర్‌-ఎంజీఆర్‌ చెన్నై సెంట్రల్‌ వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ను ఈ నెల 15వ తేదీ మధ్యాహ్నాం 1.30 గంటలకు కేంద్ర పారిశ్రామిక ఉక్కు శాఖల సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ ప్రారంభించనున్నారు. కోనసీమ ప్రాంతం అభివృద్ధి చెందటంలో చాలా ముందుందని రైలు ప్రయాణ ప్రామాణికాలు ఎక్కువగా ఉండటంతో ఈ ప్రాంతానికి వందేభారత్‌ ఎక్స్‌ప్రె్‌సను నడుపుతున్నట్టు విజయవాడ రైల్వే డివిజన్‌ శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. ఎంజీఆర్‌ చెన్నై సెంట్రల్‌ స్టేషన్‌ నుంచి సుమారు 655 కిలోమీటర్ల దూరాన ఉన్న నరసాపూర్‌ చేరేందుకు 9 గంటల సమయం పడుతుందని, ఈ ప్రాంత ప్రయాణికులకు వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ సౌలభ్యాన్ని మొట్టమెదటిసారిగా కల్పిస్తున్నట్టు పేర్కొంది. ఈ రైలులో 7 ఏసీ చైర్‌ కార్‌లు, ఒక ఎగ్జిక్యూటివ్‌ చైర్‌ కార్‌ ఉంటాయని, 530 మంది ప్రయాణించటానికి వీలుందని వెల్లడించింది.

కాకినాడ టౌన్‌ నుంచి 41 ప్రత్యేక సర్వీసులు

సంక్రాంతి రద్దీ దృష్ట్యా జనవరి 8 నుంచి 20వ తేదీ వరకు కాకినాడ టౌన్‌ నుంచి వికారాబాద్‌కు, వికారాబాద్‌-నరసాపూర్‌, సికింద్రాబాద్‌-నరసాపూర్‌, సికింద్రాబాద్‌-కాకినాడ టౌన్‌ మధ్య 41 ప్రత్యేక సర్వీసులు రాకపోకలు సాగించనున్నాయి. ఈ నెల 14వ తేదీ ఉదయం 8 గంటల నుంచి ఈ రైళ్లకు రిజర్వేషన్‌ చేసుకునే సదుపాయం ఉందని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.

Updated Date - Dec 14 , 2025 | 04:59 AM