Share News

అంబేడ్కర్‌ విగ్రహంతో వైసీపీ నీచరాజకీయం: వర్ల

ABN , Publish Date - Oct 09 , 2025 | 06:20 AM

ప్రజలు ఎన్నుకున్న కూటమి ప్రభుత్వాన్ని అస్థిరపర్చేందుకు జగన్‌ కుట్రలు చేస్తున్నారని, అంబేడ్కర్‌ విగ్రహాలను ధ్వంసం చేస్తూ నీచ రాజకీయాలకు తెరదీస్తున్నారని...

అంబేడ్కర్‌ విగ్రహంతో వైసీపీ నీచరాజకీయం: వర్ల

అమరావతి, అక్టోబరు 8(ఆంధ్రజ్యోతి): ప్రజలు ఎన్నుకున్న కూటమి ప్రభుత్వాన్ని అస్థిరపర్చేందుకు జగన్‌ కుట్రలు చేస్తున్నారని, అంబేడ్కర్‌ విగ్రహాలను ధ్వంసం చేస్తూ నీచ రాజకీయాలకు తెరదీస్తున్నారని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మాట్లాడారు. దళితులపై జగన్‌కు ఎలాంటి ప్రేమ లేదన్నారు. వారిని అడ్డం పెట్టుకుని అందలం ఎక్కడమే జగన్‌ లక్ష్యమని దుయ్యబట్టారు. చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రంలో దళితులు ప్రశాంతంగా ఉన్నారని, వారిని రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలని జగన్‌ చూస్తున్నాడని విమర్శించారు.

Updated Date - Oct 09 , 2025 | 06:21 AM