Share News

Kidnap Case: లొంగిపోయిన వంశీ అనుచరుడు ‘కోట్లు’

ABN , Publish Date - Dec 09 , 2025 | 06:14 AM

ముదునూరి సత్యవర్ధన్‌ కిడ్నాప్‌ కేసులో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్‌ ప్రధాన అనుచరుడు కొమ్మా కోటేశ్వరరావు అలియాస్‌ కోట్లు...

Kidnap Case: లొంగిపోయిన వంశీ అనుచరుడు ‘కోట్లు’

  • కోర్టులో హాజరుపరిచిన పోలీసులు

  • సత్యవర్ధన్‌ కిడ్నాప్‌ కేసులో 15 వరకు రిమాండ్‌

విజయవాడ, డిసెంబరు 8(ఆంధ్రజ్యోతి): ముదునూరి సత్యవర్ధన్‌ కిడ్నాప్‌ కేసులో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్‌ ప్రధాన అనుచరుడు కొమ్మా కోటేశ్వరరావు అలియాస్‌ కోట్లు పోలీసులకు సోమవారం లొంగిపోయాడు. పోలీసులు అతడిని ఏసీబీ కోర్టులో హాజరుపరచగా న్యాయాధికారి పి.భాస్కరరావు ఈనెల 15 వరకు రిమాండ్‌ విధించారు. సత్యవర్ధన్‌ కిడ్నాప్‌లో వంశీ ప్రణాళికను అమలు చేసిన కోట్లును కేసులో ఏ2గా చేర్చారు. ఈకేసులో ఇటీవలే ఇద్దరు నిందితులు ఏ6 వజ్రకుమార్‌, ఏ3 తేలప్రోలు రాము కోర్టులో లొంగిపోయారు. అలాగే ఏ9 ఎర్రంశెట్టి రామాంజనేయులును పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు. హైదరాబాద్‌లో ఉంటున్న కోట్లు ఇటీవల విజయవాడకు వచ్చి పటమట పోలీసులకు లొంగిపోయాడు. అతడిని నెల్లూరు జైలుకు తరలించాలని కోర్టు ఆదేశాలిచ్చింది.

Updated Date - Dec 09 , 2025 | 06:15 AM