వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాలి
ABN , Publish Date - Oct 11 , 2025 | 11:54 PM
వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాలని వాల్మీకి హక్కుల పోరాట సమితి నాయకులు డిమాండ్ చేశారు.
నందికొట్కూరు రూరల్, అక్టోబరు 11(ఆంధ్రజ్యోతి) : వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాలని వాల్మీకి హక్కుల పోరాట సమితి నాయకులు డిమాండ్ చేశారు. శనివారం మండలంలోని అల్లూరు సమీపంలో గల ఎనఎ్‌స ఫంక్షన హాల్‌లో వాల్మీకుల చైతన్య సభ నిర్వహించారు. ముఖ్య అతిథులుగా వాల్మీకి బోయ హక్కుల పోరాట సమితి నాయకుడు జెక్కుల శ్రీనివాసరావు, మహర్షి వాల్మీకి రిజర్వేషన పోరాటసమితి నాయకుడు బోయపులి కొండ న్న, వాల్మీకి న్యాయవాదుల సంఘం నాయకుడు జే వెంకటరాముడు హా జరయ్యారు. సమావేశంలో జెక్కుల శ్రీనివాసరావు మాట్లాడుతూ భారత దేశంలో ఏ రాష్ట్రంలో చూసినా వాల్మీకులు ఎస్సీలుగానో, ఎస్టీలుగానో ఉన్నారన్నారు. ఒక్క మన తెలుగు రాష్ట్రాలలో మాత్రం రాజకీయ కుట్రలకు బలిపశువులుగా మారి ఏజెన్సీ, మైదాన ప్రాంతమంటూ విడదీసి వాల్మీకులను బీసీలుగా చూపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది ఏమాత్రం సమంజసం కాదన్నారు. సమాజంలో అన్నిరకాలుగా వెనుకబడిన వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాలని డిమాండ్ చేశారు. సమావేశంలో వాల్మీకి నాయకులు గుజుల గౌరీశ్వరనాయుడు, రాముడు, రమ ణ, బొళ్లవరం రవి పాల్గొన్నారు.