Share News

BJP president P.V.N. Madhav: భారత్‌ సత్తాను ప్రపంచానికి చాటిన నేత వాజపేయి

ABN , Publish Date - Dec 16 , 2025 | 03:02 AM

తన హయాంలో ప్రజలకు సుపరిపాలన అందిస్తూ, అణుబాంబు ప్రయోగంతో భారత్‌ సత్తాను ప్రపంచానికి చాటిన గొప్ప నాయకుడు దివంగత మాజీ ప్రధాని...

BJP president P.V.N. Madhav: భారత్‌ సత్తాను ప్రపంచానికి చాటిన నేత వాజపేయి

  • నెల్లూరు, ఒంగోలుల్లో విగ్రహావిష్కరణ

  • పాల్గొన్న మంత్రులు ఆనం, సత్యకుమార్‌, డోలా

నెల్లూరు (స్టోన్‌హౌ్‌సపేట), ఒంగోలు కార్పొరేషన్‌, డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి): తన హయాంలో ప్రజలకు సుపరిపాలన అందిస్తూ, అణుబాంబు ప్రయోగంతో భారత్‌ సత్తాను ప్రపంచానికి చాటిన గొప్ప నాయకుడు దివంగత మాజీ ప్రధాని, భారత రత్న అటల్‌ బిహారి వాజపేయి అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్‌ మాధవ్‌ పేర్కొన్నారు. అటల్‌, మోదీ సుపరిపాలన బస్సుయాత్ర సోమవారం నెల్లూరుకు చేరుకొంది. ఈ సందర్భంగా నగరంలోని హరనాథపురం సెంటర్‌లో ఏర్పాటు చేసిన వాజపేయి కాంస్య విగ్రహాన్ని రాష్ట్ర మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, సత్యకుమార్‌, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలతో కలిసి మాధవ్‌ ఆవిష్కరించారు. నెల్లూరులో ఈ చౌక్‌ను అటల్‌ బిహారీ వాజపేయి చౌక్‌గా మార్చాలని మంత్రి ఆనంను సభాముఖంగా కోరారు. కార్యక్రమంలో శాసన సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, కావ్య కృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, రాజ్యసభ సభ్యుడు బీద మస్తా న్‌రావు, బీజేపీ బస్సుయాత్ర రాష్ట్ర కన్వినర్‌ నాగోతు రమేశ్‌, బీజేపీ శ్రేణులు పాల్గొన్నారు. అలాగే, ఒంగోలు వెంగ ముక్కల పాలెం జంక్షన్‌లో మంత్రి డోలా బాల వీరాంజ నేయస్వామితో కలిసి మాధవ్‌.. వాజపేయి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దన్‌, ముక్కు ఉగ్రనరసింహారెడ్డి, కందుల నారాయణరెడ్డి, 20సూత్రల అమలు కమిటీ చైర్మన్‌ లంకా దినకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 16 , 2025 | 03:02 AM