Share News

Vaikunta Dwaram Darshan Tokens: ఈ డిప్‌లో టోకెన్లు రాలేదా!

ABN , Publish Date - Dec 20 , 2025 | 05:32 AM

వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి ఈ-డిప్‌ విధానంలో టోకెన్లు రాకపోయినప్పటికీ జనవరి 2 నుంచి 8వ తేదీ వరకు ఎప్పుడైనా శ్రీవారి దర్శనం చేసుకోవచ్చంటూ....

Vaikunta Dwaram Darshan Tokens: ఈ డిప్‌లో టోకెన్లు రాలేదా!

  • 2 నుంచి 8 వరకు ఏ రోజైనా శ్రీవారిని దర్శించుకోవచ్చు

  • వైకుంఠద్వార దర్శన రిజిస్ర్టేషన్‌ భక్తులకు టీటీడీ మెసేజ్‌లు

తిరుమల, డిసెంబరు 19(ఆంధ్రజ్యోతి): వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి ఈ-డిప్‌ విధానంలో టోకెన్లు రాకపోయినప్పటికీ జనవరి 2 నుంచి 8వ తేదీ వరకు ఎప్పుడైనా శ్రీవారి దర్శనం చేసుకోవచ్చంటూ టీటీడీ భక్తులకు మెసేజ్‌లు పంపుతోంది. ఈ నెల 30 నుంచి జనవరి 8వ తేదీ వరకు తిరుమలలో పది రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలు జరగనున్నాయి. 30న వైకుంఠ ఏకాదశి, 31న ద్వాదశి, జనవరి 1వ తేదీకి సంబంధించిన మూడు రోజుల సర్వదర్శన టోకెన్లను నవంబరు 27వ తేదీన ఈ-డిప్‌ విధానంలో విడుదల చేసింది. 2వ తేదీన 1.76 లక్షల మందిని ఈ-డిప్‌ ద్వారా ఎంపిక చేసింది. రిజిస్ర్టేషన్‌ చేసుకుని టోకెన్లు పొందలేకపోయిన మిగిలిన భక్తులు జనవరి 2 నుంచి 8వ తేదీ వరకు ఎప్పుడైనా తిరుమలకు వచ్చి సర్వదర్శనం క్యూలైన్‌లో వెళ్లి స్వామిని దర్శనం చేసుకోవచ్చు. ఈ విషయాన్ని ఆయా భక్తుల ఈ మెయిళ్లు, సెల్‌ఫోన్‌ నెంబర్లకు టీటీడీ మెసేజ్‌ పంపుతోంది.

Updated Date - Dec 20 , 2025 | 05:32 AM