Share News

Minister Sandhya Rani: ఐటీడీఏల్లో ఖాళీలను భర్తీ చేస్తాం

ABN , Publish Date - Sep 26 , 2025 | 05:34 AM

రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల్లోని పలు ఐటీడీఏల్లో మొత్తం 127 పోస్టులు ఖాళీగా ఉన్నాయని, ప్రత్యక్ష నియామక పోస్టులను ఏపీపీఎస్సీ, డీఎస్సీ ద్వారా భర్తీ చేస్తామని రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖా మంత్రి...

 Minister Sandhya Rani: ఐటీడీఏల్లో ఖాళీలను భర్తీ చేస్తాం

ఏపీపీఎస్సీ, డీఎస్సీ ద్వారా నియామకాలు: మంత్రి సంధ్యారాణి

అమరావతి, సెప్టెంబరు 25(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల్లోని పలు ఐటీడీఏల్లో మొత్తం 127 పోస్టులు ఖాళీగా ఉన్నాయని, ప్రత్యక్ష నియామక పోస్టులను ఏపీపీఎస్సీ, డీఎస్సీ ద్వారా భర్తీ చేస్తామని రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖా మంత్రి సంధ్యారాణి తెలిపారు. గురువారం శాసనమండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానమిచ్చారు. గిరిజన సంక్షేమ శాఖలో 2 వేల టీచర్‌ పోస్టులను డీఎస్సీ ద్వారా ప్రభుత్వం భర్తీ చేసిందని మంత్రి వివరించారు. గత ఐదేళ్లులో ఒక్కరికీ పదోన్నతి కల్పించలేదన్నారు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే 19 మందికి పదోన్నతి ఇచ్చామన్నారు. ఐటీడీఏల్లో ఐఏఎస్‌ అధికారులను నియమించామన్నారు. కొత్తగా నియమించిన ఉపాధ్యాయ పోస్టుల కారణంగా ఎప్పటి నుంచో విద్యాబుద్ధులు నేర్పుతున్న కాంట్రాక్టు టీచర్లను తొలగించే ప్రతిపాదన ఏదీలేదని మంత్రి స్పష్టం చేశారు.

Updated Date - Sep 26 , 2025 | 05:35 AM