Share News

Maoist Document Debates: ఆయుధాలు వదిలేద్దాం

ABN , Publish Date - Dec 16 , 2025 | 03:38 AM

ఆయుధాలు వదిలేద్దాం.. ఇలా రహస్యంగా ఉండి వర్గపోరుకు అవసరమైన ప్రజా మద్దతు కూడగట్టలేం. మ హారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఉత్తర ప్రాంతా ల రాష్ట్ర కమిటీలు రహస్యం గా ఉండి వర్గపోరు....

Maoist Document Debates: ఆయుధాలు వదిలేద్దాం

  • ఇక రహస్య ఉద్యమాలు చేయడం కష్టం

  • వర్గపోరు తగ్గింది... దోపిడీల రూపు మారింది

  • 2024లో మావోయిస్టు పొలిట్‌బ్యూరోలో చర్చ

  • వెలుగులోకి సంచలన డాక్యుమెంట్‌

హైదరాబాద్‌, డిసెంబరు 15(ఆంధ్రజ్యోతి): ‘ఆయుధాలు వదిలేద్దాం.. ఇలా రహస్యంగా ఉండి వర్గపోరుకు అవసరమైన ప్రజా మద్దతు కూడగట్టలేం. మ హారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఉత్తర ప్రాంతా ల రాష్ట్ర కమిటీలు రహస్యం గా ఉండి వర్గపోరు చేయలేమంటున్నాయి. జనజీవన స్రవంతిలోకి వస్తేనే ఉద్యమాలకు అవసరమైన ప్రజా మద్దతును కూడగట్టగలం అంటున్నా యి’ అని మావోయిస్టుల్లోని ఒక వర్గం గత రెండేళ్ల నుంచే వాదించిన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన సంచలన డాక్యుమెంట్‌ సోమవారం వెలుగుచూసింది. మావోయిస్టు పార్టీ పొలిట్‌బ్యూరో 2024లో అన్ని స్థాయిల్లోని కమిటీలకు ఈ డాక్యుమెంట్‌ను పంపిం ది. రహస్య జీవితంలో ఉండి వర్గపోరు చేయలేమని ఆయా రాష్ట్రాల రాష్ట్ర కమిటీలు అన్నట్లుగా ఆ డాక్యుమెంట్‌లో పొలిట్‌బ్యూరో పేర్కొంది. ఒకవైపు ప్రభుత్వ నిర్బంధం, బలగాల దాడులను తట్టుకోవడంలో కొంతమేర విఫ లం కావడం, సమాజంలో నాటికి-నేటికి మారిన పరిణామాల దృష్ట్యా ఇక రహస్య జీవితం సాధ్యం కాదన్న వాదన పలు రాష్ట్రాల కమిటీలు లేవనెత్తా యి. 31 పేజీల ఈ డాక్యుమెంట్‌లో మూడున్నరేళ్ల కాలంలో పార్టీకి అనుకూలంగా, ప్రతికూలంగా పరిణమించిన అంశాలపై చర్చ జరిగింది. అయితే మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఉత్తర ప్రాంతాల రాష్ట్ర కమిటీల వాదన సరైంది కాదని ఈ డాక్యుమెంట్‌ పేర్కొంది.


మూడేళ్లలో 683 మంది మావోయిస్టులు మృతి

ఈ డాక్యుమెంటులో 2024కు ముందు మూడేళ్లలో జరిగిన పరిణామాలను వివరించారు. ‘2024కు ముందు మూడేళ్లలో భద్రతా బలగాల ఎన్‌కౌంటర్‌లో 683 మంది మావోయిస్టులు మరణించారు. వీరిలో 190 మంది మహిళలున్నారు. మావోయిస్టులు చేసిన 669 దాడుల్లో 261 మంది పోలీసులు చనిపోగా, 516 మంది గాయపడ్డారు. మనం 25కు పైగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నాం. 2021 నుంచి పార్టీ కీలక నేతలను కోల్పోయింది. వీరిలో నలుగురు కేంద్ర కమిటీ సభ్యులు లక్ము, అంబీఆర్‌, సాకేత్‌, ఆనంద్‌ అనారోగ్యంతో చనిపోయారు. భద్రతా బలగాల దాడుల్లో కొందరు చనిపోయారు. బలగాల చర్యలను తిప్పికొట్టడంలో కేంద్ర కమిటీతో పాటు స్టేట్‌, జోనల్‌ కమిటీలు విఫలమయ్యాయి... అని పేర్కొన్నారు.

పరిస్థితులు మారాయి

సమాజంలో వచ్చిన మార్పులపై లోతైన అంతర్మథనాన్ని డాక్యుమెంటులో వివరించారు. ‘2012లో కూడా ఒకసారి ఇలానే పార్టీకి తీవ్రమైన దెబ్బ తగిలింది. అయితే దాన్నుంచి మళ్లీ 2013 నాటికే కోలుకున్నాం. కానీ ఈ మూడున్నరేళ్లలో మాత్రం చాలా కోల్పోయాం. పార్టీ పనితీరులో లోపాలున్నాయి. గోప్యత తగ్గింది. కమిటీల మధ్య సమన్వయం లేదు. సమాజంలోనూ మార్పులొచ్చాయి. గతంలో ఉన్నట్లుగా భూస్వామ్య దోపిడీ ఇప్పుడు ప్రత్యక్షంగా లేదు. దోపిడీల రూపుమారింది. ప్రజలు బతకడం కోసం పోరాడాల్సిన పరిస్థితి అంతగా లేదు. మావోయిస్టు పార్టీలో కూడా బూర్జువా, భూస్వామ్య అభిప్రాయాలు, భావనలు చొరబడ్డాయి. కొత్త ప్రజా సంఘాలను ఏర్పాటుచేసుకుంటేనే పార్టీ కొనసాగుతుంది. పార్టీ కమిటీల్లో 3 తరాల వయసుల వారు ఉండేలా చూడాలి’ అని అభిప్రాయపడ్డారు. ఏపీ, తెలంగాణ రాష్ట్ర కమిటీలు కూడా ప్రజా ఉద్యమాలను నిర్మించడంలో విఫలమయ్యాయని డాక్యుమెంట్‌ పేర్కొంది. రహస్యంగా ఉంటూనే సమాజంలో ఉద్యమాలను నిర్మించాలన్నది పార్టీ లక్ష్యమెతే.. దానిని అర్థం చేసుకోకుం డా రహస్యంగా ఉండిపోవడమే పని అనుకున్నారని విమర్శించింది.

Updated Date - Dec 16 , 2025 | 03:38 AM