Share News

రోజుకో స్కీంతో టీచర్లపై ఒత్తిడి: యూటీఎఫ్‌

ABN , Publish Date - Dec 08 , 2025 | 04:43 AM

వెకేషన్‌ శాఖగా ఉన్న పాఠశాల విద్యాశాఖను అత్యవసర శాఖగా మార్చి టీచర్లను మానసిక ఒత్తిడికి గురిచేస్తున్నారని యునైటెడ్‌ టీచర్స్‌ సమాఖ్య అధ్యక్షుడు...

రోజుకో స్కీంతో టీచర్లపై ఒత్తిడి: యూటీఎఫ్‌

అమరావతి, డిసెంబరు 7(ఆంధ్రజ్యోతి): వెకేషన్‌ శాఖగా ఉన్న పాఠశాల విద్యాశాఖను అత్యవసర శాఖగా మార్చి టీచర్లను మానసిక ఒత్తిడికి గురిచేస్తున్నారని యునైటెడ్‌ టీచర్స్‌ సమాఖ్య అధ్యక్షుడు ఎన్‌.వెంకటేశ్వర్లు ఆరోపించారు. ఆదివారం విజయవాడలో జరిగిన యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో దీనిపై తీర్మానం చేశారు. పాఠశాల విద్యాశాఖ వెకేషన్‌ శాఖగా ఉందని, దీనిని నాన్‌ వెకేషన్‌గా మార్చమని కోరితే ప్రభుత్వం తిరస్కరించిందని తెలిపారు. రోజుకో కొత్త స్కీమ్‌ పేరుతో టీచర్లను ఒత్తిడికి గురిచేస్తున్నారన్నారు. పదో తరగతి బోధించే టీచర్లకు సెలవులు ఇవ్వడం లేదన్నారు. టెన్త్‌ ఉత్తీర్ణత 100శాతం చేయాలనే పేరుతో రోజూ సాయంత్ర పరీక్షలు నిర్వహించి మార్కులు అప్‌లోడ్‌ చేయించడం మానసికంగా వేధించడమే అవుతుందన్నారు. ఇన్‌ సర్వీస్‌ టీచర్లకు టెట్‌ మినహాయింపు కోరుతూ ఈనెల 9, 10 తేదీల్లో పాత తాలూకా కేంద్రాల్లో నిరసన ర్యాలీలు, 18న జిల్లా కేంద్రాల్లో నిరసలు చేపడుతున్నామని చెప్పారు.

Updated Date - Dec 08 , 2025 | 04:47 AM