Mala Mahanadu Leaders: యూజ్‌లెస్ ఫెలో.. ఎవడ్రా నువ్వు
ABN , Publish Date - Oct 13 , 2025 | 05:49 AM
గుంటూరు జిల్లా ప్రత్తిపాడు ఎమ్మె ల్యే, మాజీ ఐఏఎస్ అధికారి బూర్ల రామాంజనేయులును మాల మహానాడు జాతీయ అ ధ్యక్షుడు గోళ్ల అరుణ్ కుమార్ అసభ్య పదజాలంతో దూషించారు.
ఎమ్మెల్యే బూర్లపై నోరు పారేసుకున్న మాల మహానాడు నేత గోళ్ల
తురకపాలెం మృతుల కుటుంబాలకు చెక్కుల పంపిణీ
గుంటూరు(తూర్పు), అక్టోబరు 12(ఆంధ్రజ్యోతి): గుంటూరు జిల్లా ప్రత్తిపాడు ఎమ్మె ల్యే, మాజీ ఐఏఎస్ అధికారి బూర్ల రామాంజనేయులును మాల మహానాడు జాతీయ అ ధ్యక్షుడు గోళ్ల అరుణ్ కుమార్ అసభ్య పదజాలంతో దూషించారు. తురకపాలెంలో వరుస మరణాల నేపథ్యంలో ఆదివారం ఆయా కు టుంబాలకు చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఈ ఘటన జరిగింది. ఒక్కొక్కరికి రూ.5 లక్ష ల చొప్పున మొత్తం 28మందికి కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సమక్షంలో బాధితులకు ఎమ్మెల్యే చెక్కులు పంపిణీచేశారు. ఈ సాయం ప్రభుత్వం చేస్తోందని, దళారులు డబ్బులు అడిగితే ఇవ్వద్దని సూచించారు. ఆ సమయంలో అక్కడే ఉన్న అరుణ్ కుమార్ ఎమ్మెల్యేను చూస్తూ అంత దౌర్భాగ్యం తమకు రాలేదన్నారు. ఒక సమయంలో నియంత్రణ కోల్పోయి ఎమ్మెల్యే వైపు వేలు చూపిస్తూ ‘ఎవడ్రా నువ్వు.. యూజ్ లెస్ ఫెలో’ అంటూ దూషించడంతో పాటు తిట్లపర్వం అందుకున్నారు. ఈ ఘటనతో కేంద్ర మంత్రి, అధికారులు షాకయ్యారు. ఎమ్మెల్యే మీదకు దూసుకువచ్చిన అరుణ్‌కుమార్‌ను పోలీసులు తీ సుకువెళ్లి పోయారు. ఎమ్మెల్యేపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాలమహానాడు నాయకులను గ్రామస్థులు అడ్డుకున్నారు. మా ఊళ్లో మీ పెత్తనం ఏమిటని నిలదీశారు. కాగా, కొందరు బాధితులు తమకూ ఆర్థిక సాయం ప్రకటించాలని కోరారు.