Share News

లీగల్‌ ఎయిడ్‌ హెల్ప్‌ డెస్క్‌ను వినియోగించుకోండి

ABN , Publish Date - Dec 11 , 2025 | 11:54 PM

జైలులో ఏర్పాడు చేసిన లీగల్‌ ఎయిడ్‌ హెల్ప్‌ డెస్క్‌ను ఖైదీలు వినియోగించుకోవాలని జిల్లా ప్రధాన న్యాయాధికారి జి. కబర్ధి అన్నారు.

   లీగల్‌ ఎయిడ్‌ హెల్ప్‌ డెస్క్‌ను వినియోగించుకోండి
జిల్లా జైలులో ప్రసంగిస్తున్న కర్నూలు జిల్లా ప్రధాన న్యాయాధికారి జి.కబర్ధి)

జిల్లా ప్రధాన న్యాయాధికారి జి. కబర్ధి

కర్నూలు లీగల్‌, డిసెంబరు 11 (ఆంధ్రజ్యోతి): జైలులో ఏర్పాడు చేసిన లీగల్‌ ఎయిడ్‌ హెల్ప్‌ డెస్క్‌ను ఖైదీలు వినియోగించుకోవాలని జిల్లా ప్రధాన న్యాయాధికారి జి. కబర్ధి అన్నారు. స్థానిక పంచలింగాలలోని జిల్లా జైలును గురువారం ఆయన అకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జైలులో ఏర్పాటు చేసిన ఫ్రిజన లీగల్‌ ఎయిడ్‌ హెల్ప్‌ డెస్క్‌ తనిఖీ చేసి వాటి ప్రాముఖ్యత గురించి ఖైదీలకు వివరించారు. ఈ హెల్ప్‌ డెస్క్‌లో ఒక న్యాయవాది, ఒక పారా లీగల్‌ వలంటీర్‌ సభ్యులుగా ఉంటారని ఆయన తెలిపారు. ఈ సభ్యులు ఖైదీలకు ఉచిత న్యాయ సహాయాన్ని అందజేస్తారని అన్నారు. 70 ఏళ్ల వయస్సు మించిన ఖైదీలకు, అనారోగ్యంతో బాధపడే వారికి త్వరితగతిన బెయిల్‌ మంజూరయ్యేందుకు కృషి చేస్తారని తెలిపారు. అనంతరం ఆయన నగరంలోని మహిళా జైలును తనిఖీ చేసి రికార్డులను, మహిళా ఖైదీలకు అందిస్తున్న సదుపాయాలను జైలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి. లీలా వెంకట శేషాద్రి, లీగల్‌ ఎయిడ్‌ డిఫెన్స కౌన్సిల్‌ శివరాం, జైలు సూపరింటెండెంట్‌ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 11 , 2025 | 11:54 PM