Share News

ఆనలైన తరగతులు వినియోగించుకోవాలి

ABN , Publish Date - Apr 26 , 2025 | 12:55 AM

వి ద్యార్థులు ఉచిత ఆనలైన తరగతులను సద్వినియోగం చేసు కోవాలని కలెక్టర్‌ రంజితబాషా అన్నారు.

 ఆనలైన తరగతులు వినియోగించుకోవాలి

ఫ నైపుణ్యం పొందేందుకు అవకాశం

ఫ రాష్ట్రంలో మొదటిసారి వర్చువల్‌ తరగతులు

ఫ కలెక్టర్‌ రంజిత బాషా

కర్నూలు ఎడ్యుకేషన, ఏప్రిల్‌ 25 (ఆంధ్రజ్యోతి): వి ద్యార్థులు ఉచిత ఆనలైన తరగతులను సద్వినియోగం చేసు కోవాలని కలెక్టర్‌ రంజితబాషా అన్నారు. శుక్రవారం యువ జన సంక్షేమ శాఖ సెట్కూరు, జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో ఏర్పాటుచేసిన వర్చువల్‌ స్టూడియోలో నిర్వహిస్తున్న ఆనలైన మాస్టర్‌క్లాస్‌ శిక్షణా తరగతులను కలెక్టర్‌ ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఈనెల 25నుంచి మే 28 వరకు 8నుంచి 12వ తరగతి విద్యార్థులకు ఆనలైన శిక్షణ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నైపుణ్య ఐఏఎస్‌ కోచింగ్‌ అకా డమీ వారి సహకారంతో 8వ తరగతి నుంచి 12వ తరగతి విద్యార్థుల కోసం కేరీర్‌ గైడెన్స, నైపుణ్యాభివృద్ది శిక్షణా తరగతులను వర్చువల్‌ విధానంద్వారా నిర్వహిస్తున్నట్లు తెలి పారు. విద్యార్థులు పైతరగతుల్లో ఏ సబ్జెక్టు ఎంచుకోవాలి.. తమకు ఏదీ అనుగుణంగా ఉంటుందని విశ్లేషించుకోవడంతో పాటు జనరల్‌నాలెడ్జ్‌ వివిధఅంశాల్లో నైపుణ్యం పొందేందుకు ఈతరగతులు ఎంతగానో ఉపయోగపడుతాయన్నారు. విద్యార్థులందరూ ఈతరగతులను వినియోగించు కోవాలన్నారు. రాష్ట్రంలో మొట్టమొదటి సారిగా జిల్లాలో వి ద్యార్థులకోసం వర్చువల్‌ తరగతులు ప్రారంభించామని కలెక్టర్‌ గుర్తుచేశారు. వర్చువల్‌ తరగతుల నిర్వహణ ద్వారా జిల్లాలో హిందీ ఉపాధ్యాయుల కొరత ఉన్నప్పటికీ పదో తర గతిలో హిందీ సబ్జెక్టులో 99శాతం పాసయ్యారని తెలిపారు. పదోతరగతి ఫెయిలైన విద్యార్థులు వర్చువల్‌ ద్వారా రెమి డియల్‌ తరగతులు, విషయ నిపుణులచే ఆనలైనలో బోధన నిర్వహిస్తున్నామని తెలిపారు. డీఈవో శామ్యూల్‌పాల్‌ మాట్లాడుతూ ఉచిత ఆనలైన శిక్షణకు సంబంధించి లింక్‌ వివరాలు, క్లాస్‌ ఫీచర్‌ ద్వారా విద్యార్థులకు షేర్‌ చేయడం జరుగుతుందన్నారు. సెట్కూరు సీఈవో డా.వేణుగోపాల్‌, నైపుణ్య ఐఏఎస్‌ అకాడమి చైర్మన క్రిష్ణ పాల్గొన్నారు.

Updated Date - Apr 26 , 2025 | 12:55 AM