Share News

US Consul General: గ్లాస్‌ బ్రిడ్జిపై అమెరికన్‌ కాన్సుల్‌ జనరల్‌

ABN , Publish Date - Dec 18 , 2025 | 03:54 AM

విశాఖపట్నం కైలాసగిరిపై కొత్తగా ఏర్పాటు చేసిన గ్లాస్‌ బ్రిడ్జిని అమెరికన్‌ కాన్సుల్‌ జనరల్‌ (హైదరాబాద్‌) లారా విలియమ్స్‌ బుధవారం సందర్శించారు....

US Consul General: గ్లాస్‌ బ్రిడ్జిపై అమెరికన్‌ కాన్సుల్‌ జనరల్‌

విశాఖపట్నం, డిసెంబరు 17 (ఆంధ్రజ్యోతి): విశాఖపట్నం కైలాసగిరిపై కొత్తగా ఏర్పాటు చేసిన గ్లాస్‌ బ్రిడ్జిని అమెరికన్‌ కాన్సుల్‌ జనరల్‌ (హైదరాబాద్‌) లారా విలియమ్స్‌ బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, సముద్ర తీరాన కొండపై నిర్మించిన ఈ నిర్మాణం ఆకర్షణీయంగా ఉందని, గ్లాస్‌ బ్రిడ్జి పై నుంచి సముద్రం, విశాఖ నగరం చాలా అందంగా కనిపిస్తున్నాయని తెలిపారు. పర్యాటకులను ఆకర్షించే మంచి ప్రాజెక్టును అందుబాటులోకి తీసుకువచ్చారని ప్రశంసించారు.

Updated Date - Dec 18 , 2025 | 03:54 AM