Share News

పట్టణాభివృద్ధే లక్ష్యం

ABN , Publish Date - Oct 18 , 2025 | 11:47 PM

పట్టణాభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎనఎండీ ఫరూక్‌ అన్నారు.

 పట్టణాభివృద్ధే లక్ష్యం
వార్డులో పర్యటిస్తున్న మంత్రి ఫరూక్‌

రూ.75 లక్షలతో అభివృద్ధి పనులు

న్యాయ, మైనార్టీ శాఖ మంత్రి ఎనఎండీ ఫరూక్‌

నంద్యాల రూరల్‌, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి) : పట్టణాభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎనఎండీ ఫరూక్‌ అన్నారు. శనివారం పట్టణంలోని నందమూరినగర్‌, వైఎస్సార్‌ నగర్‌, ఆటోనగర్‌లో మొత్తం రూ.75లక్షల అంచనా వ్య యంతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు భూమిపూజ చేశారు. మంత్రి ఫరూక్‌ మాట్లాడుతూ స్థానిక ప్రజల సమస్యలను పరిష్కరించే దిశగా ఈ అభివృద్ధి పనులను ప్రారంభించినట్లు తెలిపారు. కుందూ బ్రిడ్జి నుంచి పెట్రోల్‌ బంకు వరకు రూ.20లక్షల వ్యయంతో రోడ్డు ప్యాచ వర్క్స్‌, వైఎస్సార్‌ నగర్‌లో రూ.15 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణ పనులు, ఆటోనగర్‌లో రూ.40లక్షల వ్యయంతో గ్రావెల్‌ రోడ్డు ఏర్పాటుకు భూమి పూజ చేశామన్నారు. నాణ్యతతో వేగంగా పనులు పూర్తిచేయాలని సంబంధిత అధికారులను, కాం ట్రాక్టర్లను మంత్రి ఆదేశించారు. కార్యక్రమంలో 38వ వార్డు టీడీపీ ఇనచార్జి తాటికొండ బుగ్గరాముడు, మున్సిపల్‌ కమిషనర్‌ శేషన్న, ఎంఈ గుర్రప్ప, పీడీ వెంకటదాస్‌, కౌన్సిలర్‌ కండే శ్యామ్‌ సుందర్‌ లాల్‌, నంద్యాల లీగల్‌ సెల్‌ జిల్లా మాజీ అధ్యక్షుడు నందం బాబురావు, స్థానిక ప్రజాప్రతినిధులు, మున్సిపల్‌ అధికారులు, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

న్యాయబద్ధంగా సమస్యలు పరిష్కరించండి

ప్రజాదర్బార్‌కు వచ్చే సమస్యలను న్యాయ బద్ధంగా పరిష్కరించాలని మంత్రి ఎన ఎం డీ ఫరూక్‌ అధికారులను ఆదేశించారు. శనివారం పట్ట ణంలోని 38వ వార్డు వైఎస్సా ఆర్‌ నగర్‌లో ప్రజాదర్బార్‌ కార్యక్రమం నిర్వహించారు. ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఎ లాంటి సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకు రావాలని కోరారు. స్వీకరించిన దరఖాస్తులను తక్షణమే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ బండి శేషన్న, 38 వవార్డు టీడీపీ ఇనచార్జి తాటికొండ బుగ్గరాముడు, మరాఠీ సూరీ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 18 , 2025 | 11:47 PM