Weather Uncertainty: వాతావరణంలో అనిశ్చితి
ABN , Publish Date - Sep 08 , 2025 | 04:31 AM
వాయవ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతం పరిసరాల్లో ఆవరించిన ఉపరితల ఆవర్తనం ఆదివారం స్థిరంగా కొనసాగింది....
విశాఖపట్నం, సెప్టెంబరు 7(ఆంధ్రజ్యోతి): వాయవ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతం పరిసరాల్లో ఆవరించిన ఉపరితల ఆవర్తనం ఆదివారం స్థిరంగా కొనసాగింది. కోస్తాలో అనేకచోట్ల ఎండ తీవ్రంగా ఉంది. కావలిలో 38.8 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. మరోవైపు కోస్తాలో పలుచోట్ల వాతావరణ అనిశ్చితితో ఉరుములు, పిడుగులు, ఈదురుగాలులతో వర్షాలు కురిశాయి. చేబ్రోలులో 7.4, గూడవల్లిలో 5.8, ఎస్.రాయవరంలో 4.8, పార్వతీపురంలో 4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.