Employee Welfare: ఆ ఐదేళ్లలో కనిపించని ఆనందాన్ని ఇప్పుడు చూస్తున్నాం
ABN , Publish Date - Oct 19 , 2025 | 03:20 AM
గత ఐదేళ్ల వైసీపీ పాలనలో కనిపించని ఆనందాన్ని ఇప్పుడు మేం చూస్తున్నాం. దీపావళికి ఉద్యోగులకు ఏదో ఒకటి చేయాలన్న సంకల్పంతో ప్రభుత్వం తీసుకున్న....
‘గత ఐదేళ్ల వైసీపీ పాలనలో కనిపించని ఆనందాన్ని ఇప్పుడు మేం చూస్తున్నాం. దీపావళికి ఉద్యోగులకు ఏదో ఒకటి చేయాలన్న సంకల్పంతో ప్రభుత్వం తీసుకున్న చొరవ మాకు సంతోషాన్ని ఇచ్చింది. గత ఐదేళ్లలో సీఎం ఎప్పుడూ ఇలా ఉద్యోగ సంఘాలతో కూర్చున్న దాఖలాల్లేవు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఉద్యోగ సంఘాలతో చర్చించిందీ లేదు. మొదటిసారి ఉద్యోగులు అడక్కుండానే ఇలాంటి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మేం ఊహించిన దానికన్నా మెరుగ్గా స్పందించారు. మళ్లీ 2014-19 నాటి పరిస్థితులను చూస్తున్నాం.’
- బొప్పరాజు వెంకటేశ్వర్లు, చైర్మన్, ఏపీజేఏసీ, అమరావతి