Tirumala Security: కొండపై తిష్టవేసిన వారి తరలింపు
ABN , Publish Date - Sep 15 , 2025 | 03:37 AM
భద్రతను దృష్టిలో ఉంచుకుని తిరుమల నుంచి యాచకులు, గుర్తింపులేని వ్యాపారులు, తిష్టవేసిన వ్యక్తులను ఆదివారం తరలించారు. ..
తిరుమలలో తనిఖీలు.. 82 మంది గుర్తింపు
తిరుమల, సెప్టెంబరు 14 (ఆంధ్రజ్యోతి): భద్రతను దృష్టిలో ఉంచుకుని తిరుమల నుంచి యాచకులు, గుర్తింపులేని వ్యాపారులు, తిష్టవేసిన వ్యక్తులను ఆదివారం తరలించారు. ఇలాంటి వారి చర్యల వల్ల ఇటీవల తిరుమలలో జరుగుతున్న అపవిత్ర ఘటనలపై ‘ఇదేం గోల గోవిందా!’ శీర్షికన ఆదివారం ‘ఆంధ్రజ్యోతి’లో ప్రత్యేక కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. ఈక్రమంలో సీవీఎస్వో మురళీకృష్ణ, ఎస్పీ సుబ్బరాయుడు ఆదేశాలతో టీటీడీ విజిలెన్స్, హెల్త్, పోలీసులు సంయుక్తంగా ఆదివారం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. కల్యాణకట్ట, షాపింగ్ కాంప్లెక్స్ ప్రాంతాల్లో ఉన్న 82 మందిని గుర్తించి తిరుమల నుంచి తిరుపతికి తరలించారు. ఇకపై నిరంతరాయంగా ఈ తనిఖీలు కొనసాగుతాయన్నారు.