Agriculture Department: త్వరలో కౌలు రైతులకూ విశిష్ఠ గుర్తింపు సంఖ్య
ABN , Publish Date - Oct 17 , 2025 | 06:20 AM
భూములున్న రైతులకు మాదిరిగానే పంట సాగుదారు హక్కుపత్రం(సీసీఆర్సీ) ఉన్న కౌలు రైతులకూ విశిష్ఠ గుర్తింపు సంఖ్య(ఐడీ) కేటాయించేందుకు విధివిధానాలు రూపొందిస్తున్నట్లు వ్యవసాయ శాఖ..
అమరావతి, అక్టోబరు 16(ఆంధ్రజ్యోతి): భూములున్న రైతులకు మాదిరిగానే పంట సాగుదారు హక్కుపత్రం(సీసీఆర్సీ) ఉన్న కౌలు రైతులకూ విశిష్ఠ గుర్తింపు సంఖ్య(ఐడీ) కేటాయించేందుకు విధివిధానాలు రూపొందిస్తున్నట్లు వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బీ రాజశేఖర్ తెలిపారు. గురువారం రాష్ట్ర సచివాలయంలో కేంద్ర, రాష్ట్ర అధికారులతో కౌలు రైతులకు ఐడీ కేటాయింపు విధివిధానాల ఖరారుకు సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రాజశేఖర్ మాట్లాడుతూ... ‘కౌలు రైతులకు ఐడీ కేటాయింపుపై సాంకేతికంగా పరీక్షించిన తర్వాత పూర్తి స్థాయిలో అమలు చేస్తాం. దీని వల్ల కౌలు రైతులు కూడా భూములున్న రైతులతో సమానంగా ప్రభుత్వం ద్వారా అన్ని ప్రయోజనాలనూ పొందగలుగుతారు’ అని చెప్పారు. అగ్రిస్టాక్ అధికారి రాజీవ్ చావ్లా, కేంద్ర ప్రభుత్వ సాంకేతిక సలహదారు సమర్థరామ్, సీసీఎల్‌ఏ జయలక్ష్మి, వ్యవసాయ, ఉద్యానశాఖ డైరెక్టర్లు మనజీర్ జిలానీ, శ్రీనివాసులు, సాయిల్ సర్వే అధికారులు పాల్గొన్నారు. కాగా వ్యవసాయ విస్తరణాధికారుల సమస్యలపై త్వరలో సమావేశం నిర్వహిస్తామని వ్యవసాయ శాఖ డైరెక్టర్ జిలానీ హామీ ఇచ్చినట్లు రాష్ట్ర వ్యవసాయ విస్తరణాధికారుల సంఘ అధ్యక్షుడు వేణుమాధవరావు తెలిపారు.