Share News

Shivraj Singh Chouhan: అగ్రి ఇంజనీరింగ్‌ డైరెక్టరేట్‌ను ఏర్పాటు చేయండి

ABN , Publish Date - Dec 29 , 2025 | 03:46 AM

వ్యవసాయంలో యాంత్రీకరణ ఆవశ్యకత పెరిగిన నేపథ్యంలో రాష్ట్ర స్థాయిలో డైరెక్టరేట్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ ఇంజనీరింగ్‌, జిల్లా, బ్లాకుల వారీగా వ్యవసాయ ఇంజనీరింగ్‌ అధికారుల...

Shivraj Singh Chouhan: అగ్రి ఇంజనీరింగ్‌ డైరెక్టరేట్‌ను ఏర్పాటు చేయండి

  • రాష్ట్రాలకు కేంద్ర వ్యవసాయ మంత్రి లేఖ

అమరావతి, డిసెంబరు 28(ఆంధ్రజ్యోతి): వ్యవసాయంలో యాంత్రీకరణ ఆవశ్యకత పెరిగిన నేపథ్యంలో రాష్ట్ర స్థాయిలో డైరెక్టరేట్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ ఇంజనీరింగ్‌, జిల్లా, బ్లాకుల వారీగా వ్యవసాయ ఇంజనీరింగ్‌ అధికారుల పోస్టులను ఏర్పాటు చేయాలని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ రాష్ట్రాలను కోరారు. ఈ మేరకు ముఖ్యమంత్రులకు తాజాగా ఆయన మరోసారి లేఖ రాశారు. ‘వ్యవసాయంలో శ్రమశక్తి ఖర్చును తగ్గించే లక్ష్యంతో యాంత్రీకరణను ప్రోత్సాహించడం తప్పనిసరి. పంట ఉత్పత్తి, కోత, శుద్ధి, విలువ జోడింపు ద్వారా రైతు ఆదాయం పెంపుదలకు యాంత్రీకరణ దోహదపడుతుంది. భవిష్యత్‌ సవాళ్లను ఎదుర్కొనేందుకు వ్యవసాయ యంత్రాలు, డ్రోన్లు, రోబోటెక్‌, సెన్సార్‌ టెక్నాలజీ వంటి సాంకేతిక పరికరాలను రైతులకు అందుబాటులోకి తేవాలి. పార్లమెంట్‌ స్టాండింగ్‌ కమిటీ సిఫారసు మేరకు 2047నాటికి 74ు యాంత్రీకరణ దిశగా చర్యలు తీసుకోవాలి. ఇందుకోసం ప్రతి రాష్ట్రంలో డైరెక్టరేట్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ ఇంజనీరింగ్‌ ఉండాలి. క్షేత్రస్థాయిలో వ్యవసాయ ఇంజనీరింగ్‌ అధికారుల పోస్టులను సృష్టించాలి’ అని కేంద్రమంత్రి సూచించారు.

Updated Date - Dec 29 , 2025 | 03:47 AM