Share News

Unemployed JAC: ఉద్యోగాల్లో స్థానిక కోటా పెంచాలి

ABN , Publish Date - Jul 23 , 2025 | 05:53 AM

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థానికత కోటాను 70 శాతం నుంచి 95శాతానికి పెంచాలని నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర కన్వీనర్‌ షేక్‌ సిద్ధిక్‌ ప్రభుత్వాన్ని కోరారు.

Unemployed JAC: ఉద్యోగాల్లో స్థానిక కోటా పెంచాలి

  • సీఎంకు నిరుద్యోగ జేఏసీ వినతి

అమరావతి, జూలై 22(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థానికత కోటాను 70 శాతం నుంచి 95శాతానికి పెంచాలని నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర కన్వీనర్‌ షేక్‌ సిద్ధిక్‌ ప్రభుత్వాన్ని కోరారు. మంగళవారం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలిసి వినతిపత్రం అందజేశారు. తెలంగాణలో స్థానికులకు 95శాతం, స్థానికేతరులకు 5శాతం కోటాలు అమలుచేస్తున్నారని సీఎంకు వివరించారు. కానీ, రాష్ట్రంలో ఇంకా 70:30 నిష్పత్తి కొనసాగుతోందన్నారు. దీనివల్ల స్థానికులకు నష్టం జరుగుతోందని వివరించారు. అలాగే జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. మెగా డీఎస్సీ నిర్వహించినందుకు, 6100 కానిస్టేబుల్‌ ఉద్యోగాలు భర్తీ చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు.

Updated Date - Jul 23 , 2025 | 05:54 AM