Child Abuse: బాలికను చెరబట్టిన బాబాయి
ABN , Publish Date - Oct 01 , 2025 | 04:08 AM
ఏడో తరగతి చదువుతున్న బాలికపై బాబాయే కన్నేశాడు. మాయమాటలు చెప్పి భయపెట్టి లొంగదీసుకుని గర్భవతిని చేశాడు.
భయపెట్టి లొంగదీసుకుని గర్భవతిని చేశాడు...పోక్సో కేసు నమోదు
విజయవాడ(పాయకాపురం), సెప్టెంబరు 30(ఆంధ్రజ్యోతి): ఏడో తరగతి చదువుతున్న బాలికపై బాబాయే కన్నేశాడు. మాయమాటలు చెప్పి భయపెట్టి లొంగదీసుకుని గర్భవతిని చేశాడు. వివరాలివీ.. విజయవాడలోని పాయకాపురం ప్రాంతానికి చెందిన బాలిక(14) ఏడో తరగతి చదువుతుంది. ఆరేళ్ల క్రితం ఆమె తండ్రి రోడ్డు ప్రమాదంలో మరణించగా కొంత కాలానికే తల్లి అనారోగ్యంతో చనిపోయింది. దీంతో తల్లి సోదరి(పిన్ని) బాలికను తన ఇంటికి తీసుకువచ్చి పెంచుకుంటోంది. ఈ నేపథ్యంలో పిన్ని భర్త ప్రవీణ్(26) బాలిక ఒంటరిగా ఉన్న సమయంలో ఆమెకు మాయమాటలు చెప్పి, బెదిరించి పలుమార్లు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బాలిక తరచూ అనారోగ్యానికి గురవుతుండటంతో అమ్మమ్మ ఆసుపత్రికి తీసుకెళ్లింది. బాలిక గర్బవతి అని వైద్యులు నిర్ధారించారు. పోక్సో చట్టం కింద కేసు నమోదుచేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.