Share News

Cultural Festival: రాష్ట్రంలో ‘ఉద్భవ్‌ 2025’ ఉత్సవాలు

ABN , Publish Date - Nov 26 , 2025 | 05:45 AM

కల వ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ పాఠశాలల్లోని(ఈఎంఆర్‌ఎస్‌) గిరిజన విద్యార్థినీ విద్యార్థులకు ఏటా నిర్వహించే సాంస్కృతిక, సాహిత్య జాతీయ ఉత్సవాలకు ఈ ఏడాది...

Cultural Festival: రాష్ట్రంలో ‘ఉద్భవ్‌ 2025’ ఉత్సవాలు

  • డిసెంబరు 3, 4, 5 తేదీల్లో నిర్వహణ

  • సచివాలయంలో ఫెస్ట్‌ పోస్టర్‌ను ఆవిష్కరించిన మంత్రి సంధ్యారాణి

అమరావతి, నవంబరు 25(ఆంధ్రజ్యోతి): ఏకల వ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ పాఠశాలల్లోని(ఈఎంఆర్‌ఎస్‌) గిరిజన విద్యార్థినీ విద్యార్థులకు ఏటా నిర్వహించే సాంస్కృతిక, సాహిత్య జాతీయ ఉత్సవాలకు ఈ ఏడాది మన రాష్ట్రం అతిథ్యం ఇస్తోందని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. ఉద్భవ్‌ 2025 పేరు తో నిర్వహించే ఈ కల్చరల్‌ ఫెస్ట్‌ను డిసెంబరు 3, 4, 5 తేదీల్లో నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. మంగళవారం అమరావతి సచివాలయం లో ఉత్సవాలకు సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. ‘గిరిజన విద్యార్థుల్లోని ప్రతిభను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నాం. ఈ ఉత్సవాల్లో 22 రాష్ట్రాలకు చెందిన 405 ఏకలవ్య పా ఠశాలల నుంచి 1,800 మంది విద్యార్థులు పాల్గొంటున్నారు. మన రాష్ట్రం నుంచి 110 మంది విద్యార్థు లు హాజరవుతున్నారు. విద్యార్థులతోపాటు మరో 278 మంది హాజరవుతారు. పోటీలను నిర్వహిస్తున్న కేఎల్‌ యూనివర్శిటీలో 12 వేదికలు ఏర్పాటు చేస్తు న్నాం. పోటీల్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు ప్రథ మ, ద్వితీయ, తృతీయ బహుమతులు, మెరిట్‌ సర్టిఫికేట్లు అందిస్తాం. ఉద్భవ్‌ 2025లో 6 నుంచి 12వ తరగతిలోపు విద్యార్థులు హాజరవుతారు. ఏకలవ్య పాఠశాలల విద్యార్థులు ఎక్కువమంది నీట్‌, ఐఐటీ, ఎన్‌ఐటీలకు ఎంపికవుతున్నారు. విదేశీ విద్యకు ఎక్కువ మంది ఎంపికయ్యేలా ఇప్పటి నుంచే చర్య లు తీసుకుంటాం. గిరిజన ప్రాంతాల్లో డోలీ మోతలకు చెక్‌ పెట్టేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుం ది. గిరిజన ప్రాంతాల్లో ఇప్పటి వరకు రూ.1,300 కో ట్లు ఖర్చు చేశాం. అల్లూరి జిల్లాకు రూ.1,000 కోట్లు కేటాయించినందుకు ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌కు ధన్యవాదాలు. హాస్టళ్లలో మౌలిక వసతులకు రూ.105 కోట్లు కేటాయించాం. ట్రైకార్‌లో దరఖాస్తు చేసుకున్న గిరిజనులకు రుణాలు మంజూరు చేస్తు న్నాం. బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ చైర్మన్‌, సభ్యుల నియామకానికి డిసెంబరులో ఇంటర్వ్యూలు నిర్వహిస్తాం’ అని మంత్రి సంధ్యారాణి వివరించారు.

Updated Date - Nov 26 , 2025 | 05:46 AM