Share News

UAE-AP Relations: సీఎంతో యూఏఈ మంత్రి అబ్దుల్లా బిన్‌ భేటీ

ABN , Publish Date - Jul 23 , 2025 | 05:04 AM

ముఖ్యమంత్రి చంద్రబాబుతో యునైటెడ్‌ అరబ్‌ ఏమిరేట్స్‌(యూఏఈ) ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్‌ సమావేశమయ్యారు.

UAE-AP Relations: సీఎంతో యూఏఈ మంత్రి అబ్దుల్లా బిన్‌ భేటీ

  • పాల్గొన్న లులూ గ్రూప్‌ సీఎండీ యూసఫ్‌ అలీ

అమరావతి, జూలై 22(ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి చంద్రబాబుతో యునైటెడ్‌ అరబ్‌ ఏమిరేట్స్‌(యూఏఈ) ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్‌ సమావేశమయ్యారు. మంగళవారం రాత్రి జరిగిన ఈ భేటీలో ఏపీలో పెట్టుబడులకు సంబంధించిన అంశాలపై చర్చించారు. లులూ ఇంటర్నేషనల్‌ చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ యూసఫ్‌ అలీ, లులూ ఫైనాన్షియల్‌ హోల్డింగ్స్‌ ఎండీ అదీబ్‌ అహ్మద్‌ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. విజయవాడలో లులూ మాల్‌ ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.

Updated Date - Jul 23 , 2025 | 05:05 AM