Suspension: నెల్లూరు సెంట్రల్ జైలులో ఇద్దరి సస్పెన్షన్
ABN , Publish Date - Sep 22 , 2025 | 04:19 AM
నెల్లూరు కేంద్ర కారాగారంలో అధికారులు, సిబ్బంది పనితీరుపై రోజురోజుకూ విమర్శలు తీవ్రమవుతున్నాయి.
ఖైదీ నుంచి ఫోన్‌పేకు నగదు వేయించుకున్నందుకు వేటు
నెల్లూరు(క్రైం), సెప్టెంబరు 21(ఆంధ్రజ్యోతి):నెల్లూరు కేంద్ర కారాగారంలో అధికారులు, సిబ్బంది పనితీరుపై రోజురోజుకూ విమర్శలు తీవ్రమవుతున్నాయి. ఇటీవల ఓ ఉన్నతాధికారి ఫోన్ సంభాషణలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. అలాగే, సెంట్రల్ జైలును రౌడీషీటర్లు తమ అడ్డాగా మార్చుకున్నట్లుగా రౌడీషీటర్ శ్రీకాంత్ విషయంలో స్పష్టమైంది. ఈ క్రమంలోనే తాజాగా.. శిక్ష పడిన ఓ ఖైదీని బ్లాక్ మార్చేందుకు ఇద్దరు అధికారులు ఫోన్‌పే ద్వారా తమ ఖాతలకు నగదు వేయించుకున్నారని ఆ ఖైదీ జైలు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు. విచారణ లో ఫోన్‌పే ద్వారా నగదు బదిలీ జరిగిన విషయం నిజమేనని తేలడంతో చీఫ్ హెడ్‌వార్డెర్ ఐ.హనుమంతరెడ్డి, డిప్యూటీ జైలర్ ఎం.విజయకుమార్‌ను జైళ్లశాఖ ఉన్నతాధికారులు సస్పెండ్ చేస్తూ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు.