NIA Court: నేవీ గూఢచర్యం కేసులో ఇద్దరికి జైలు శిక్ష
ABN , Publish Date - Nov 26 , 2025 | 04:18 AM
మన దేశ రహస్యాలను పాకిస్థాన్‌కు చేరవేశారన్న కేసులో నేరం రు జువు కావడంతో మరో ఇద్దరు నిందితులకు శిక్షలు విధి స్తూ ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టు మంగళవారం కీలక తీర్పు వెలువరించింది.
కీలక తీర్పు చెప్పిన ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టు
అమరావతి, నవంబరు 25(ఆంధ్రజ్యోతి): మన దేశ రహస్యాలను పాకిస్థాన్‌కు చేరవేశారన్న కేసులో నేరం రు జువు కావడంతో మరో ఇద్దరు నిందితులకు శిక్షలు విధి స్తూ ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టు మంగళవారం కీలక తీర్పు వెలువరించింది. రాజస్థాన్‌కు చెందిన అశోక్ కుమార్, వికాస్ కుమార్‌కు ఐదేళ్ల 11 నెలల సాధారణ జైలు శిక్షతో పాటు రూ.5వేల జరిమానా విధిస్తూ న్యాయాధికారి తీర్పు చెప్పారు. జరిమానా చెల్లించలేకపోతే మరో ఏడాది పాటు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. విశాఖపట్నంలోని నేవీ స్థావరాలకు చెందిన రహస్యాలను హనీట్రాప్(వలపువల) ద్వారా పాకిస్థాన్ సేకరిస్తోందని ఏపీ ఇంటెలిజెన్స్ పోలీసులు 2019లో గుర్తించారు. అనంతరం ఈ కేసును జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ)కు అప్పగించారు. ఉగ్రవాద నిరోధక చట్టం(యూఏపీఏ) కింద 2019 డిసెంబరు లో విశాఖతో పాటు దేశంలోని పలు పోర్టుల్లో గూఢచర్యానికి పాల్పడుతున్న 15మందిపై కేసు నమోదు చేసింది. 2020 జూన్‌లో 14మందిపై, 2021 మార్చి మరొకరిపై ఎన్‌ఐఏ చార్జిషీట్ దాఖలు చేసింది. ఎన్‌ఐఏ కోర్టు ఇప్పటికే ఆరుగురికి శిక్షలు విధించింది.