Share News

NIA Court: నేవీ గూఢచర్యం కేసులో మరో ఇద్దరికి జైలుశిక్ష

ABN , Publish Date - Nov 08 , 2025 | 05:30 AM

పాకిస్థాన్‌ ఏజెంట్లకు భారత నౌకాదళం సమాచారాన్ని రహస్యంగా అందిస్తూ దొరికిపోయిన ఇద్దరు (గూఢచర్యం కేసు) నిందితులకు...

NIA Court: నేవీ గూఢచర్యం కేసులో మరో ఇద్దరికి జైలుశిక్ష

విశాఖపట్నం, నవంబరు 7(ఆంధ్రజ్యోతి): పాకిస్థాన్‌ ఏజెంట్లకు భారత నౌకాదళం సమాచారాన్ని రహస్యంగా అందిస్తూ దొరికిపోయిన ఇద్దరు (గూఢచర్యం కేసు) నిందితులకు విశాఖలోని ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టు 70 నెలల చొప్పున జైలుశిక్ష, ఐదువేల జరిమానా విధిస్తూ శుక్రవారం తీర్పు చెప్పింది. ఈ కేసులో ఆరుగురిని దోషులుగా నిర్ధారించి శిక్ష విధించగా, తాజాగా శిక్షపడినవారిలో విశాఖ జిల్లాకు చెందిన కలవలపల్లి కొండబాబు, హిమాచల్‌ప్రదేశ్‌లోని కాంగ్రా జిల్లాకు చెందిన అవియాన్ష్‌ సోమల్‌ ఉన్నారు.

Updated Date - Nov 08 , 2025 | 05:31 AM