Share News

హత్యాయత్నం కేసులో ఇరువురి అరెస్టు

ABN , Publish Date - Apr 09 , 2025 | 11:46 PM

శిరివెళ్ల మండలం గోవిందపల్లె గ్రామంలో ఇటీవల ఇందూరి ప్రతాప్‌రెడ్డిపై జరిగిన హత్యాయత్నం కే సులో ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు నంద్యాల ఎస్పీ అధిరాజ్‌ సింగ్‌ రాణా తెలిపారు.

 హత్యాయత్నం కేసులో ఇరువురి అరెస్టు
నిందితులతో జిల్లా ఎస్పీ ఇతర అధికారులు

ఆళ్లగడ్డ, ఏప్రిల్‌ 7 (ఆంధ్రజ్యోతి): శిరివెళ్ల మండలం గోవిందపల్లె గ్రామంలో ఇటీవల ఇందూరి ప్రతాప్‌రెడ్డిపై జరిగిన హత్యాయత్నం కే సులో ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు నంద్యాల ఎస్పీ అధిరాజ్‌ సింగ్‌ రాణా తెలిపారు. బుధవారం ఆళ్లగడ్డ డీఎస్పీ కార్యాలయంలో ఇద్దరు నిందితులను అరెస్టు చూపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శిరివెళ్ల మండలం గోవింపల్లె గ్రామానికి చెందిన రవీంద్రారెడ్డి, సంజామల మండలం పెరుసోముల గ్రామానికి చెందిన సందెపోగుల పక్కిరయ్యతోపాటు మరో ముగ్గురు ఇందూరి ప్రతాప్‌రెడ్డిపై కత్తితో దాడి చేశారన్నారు. ఈ కేసులో రవీంద్రారెడ్డి, పక్కిరయ్యలను గోవిందపల్లె గ్రామ శివారులో నంద్యాల-కడప హైవే రోడ్డులోని కానాలపల్లి మెట్ట వద్ద అరెస్టు చేశామన్నారు. 2017 సంవత్సరంలో అదె గ్రామానికి చెందిన ప్రతాప్‌రెడ్డి అన్న ఇందూరు ప్రభాకర్‌రెడ్డి హత్య కేసులో రవీంద్రారెడ్డి కూడా నిందితుడనిఇ అన్నారు. పాత కక్షల కారణంగా దాడి చేశారని భావిస్తున్నట్లు ఆయన వివరించారు. ఈ కేసులో సహకరించిన మరో ముగ్గురు నిందితుల కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. కేసులో చురుకుగా వ్యవహరించిన ఆళ్లగడ్డ డీఎస్పీ ప్రమోద్‌, శిరివెళ్ల సీఐ వంశీధర్‌, ఎస్సై చిన్నపీరయ్యలను ఆయన ప్రశంసా పత్రాలతో అభినందించారు.

Updated Date - Apr 09 , 2025 | 11:46 PM