Share News

AP Govt: తురకపాలెం మృతుల కుటుంబాలకు సాయం

ABN , Publish Date - Oct 12 , 2025 | 07:03 AM

మెలియాయిడోసిస్‌ వ్యాధి లక్షణాలతో గుంటూరు జిల్లా తురకపాలెం గ్రామంలో చనిపోయిన వ్యక్తుల కుటుంబాలను...

AP Govt: తురకపాలెం మృతుల కుటుంబాలకు సాయం

  • రూ.5 లక్షల చొప్పున 28 మందికి

  • నేడు చెక్కులు ఇవ్వనున్న కేంద్ర మంత్రి పెమ్మసాని

గుంటూరు, అక్టోబరు 11(ఆంధ్రజ్యోతి): మెలియాయిడోసిస్‌ వ్యాధి లక్షణాలతో గుంటూరు జిల్లా తురకపాలెం గ్రామంలో చనిపోయిన వ్యక్తుల కుటుంబాలను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. మృతుల్లో ఎక్కువమంది పేదలు కావడంతో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ చొరవ తీసుకొని ప్రభుత్వం తరుపున మృతుల కుటుంబాలకు సాయం ప్రకటించాలని సీఎం చంద్రబాబును అభ్యర్థించారు. దీనిపై సీఎం స్పందించి మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం మంజూరు చేశారు. దీంతో మొత్తం 28 మందికి రూ. కోటి 40 లక్షలను ఆదివారం కేంద్ర మంత్రి పెమ్మసాని, ఎమ్మెల్యే రామాంజనేయులు తురకపాలెంలో అందజేయనున్నారు.

Updated Date - Oct 12 , 2025 | 07:03 AM