గ్రంథాలయ చైర్మనగా తుగ్గలి నాగేంద్ర
ABN , Publish Date - Dec 11 , 2025 | 11:56 PM
తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకుడిగా గుర్తింపు పొందిన తుగ్గలి నాగేంద్రకు సముచితస్థానం దక్కింది.
రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల జారీ
తుగ్గలి, డిసెంబరు 11 (ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకుడిగా గుర్తింపు పొందిన తుగ్గలి నాగేంద్రకు సముచితస్థానం దక్కింది. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మనగా ఆయన్ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా కొనసాగుతున్న తుగ్గలి నాగేంద్ర గతంలో కుమ్మరిశాలివాహన కార్పొరేషన చైర్మనగా పనిచేశారు. పార్టీ ఆవిర్భావం నుంచి టీడీపీలో క్రియాశీలకంగా వ్యవహరించిన ఆయన సీఎం చంద్రబాబు నాయుడుకు తొలినుంచి సన్నిహితంగా మెలిగారు. పార్టీలో పలు కీలక పదవులు చేపట్టిన ఆయనకు తాజాగా గ్రంథాలయ సంస్థ చైర్మనగా అవకాశం దక్కడంపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రంథాలయ చైర్మనగా తనకు సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ అవకాశం కల్పించారన్నారు. వారితో పాటు పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు, జిల్లా టీడీపీ కుటుంబానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా గ్రంథాలయాల అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.