తిరుమలలో రీల్స్ చేస్తే కేసులు: టీటీడీ
ABN , Publish Date - Aug 01 , 2025 | 04:16 AM
తిరుమల పవిత్రతకు భంగం కలిగించేలా రీల్స్, షార్ట్స్ చేసే వ్యక్తులపై కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని టీటీడీ మరోమారు స్పష్టం చేసింది.
తిరుమల, జూలై 31 (ఆంధ్రజ్యోతి): తిరుమల పవిత్రతకు భంగం కలిగించేలా రీల్స్, షార్ట్స్ చేసే వ్యక్తులపై కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని టీటీడీ మరోమారు స్పష్టం చేసింది. తిరుమల శ్రీవారి ఆలయం ముందు, మాడవీధుల్లో ఇటీవల కొంతమంది వెకిలి చేష్టలు చేస్తూ, నృత్యాలు చేస్తూ వీడియోలు చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో అప్‌లోడ్ చేస్తున్నారని తెలిపింది. తిరుమలలాంటి ఆధ్యాత్మిక క్షేత్రంలో ఇలాంటి అభ్యంతరకర, అసభ్యకర చర్యలు అనుచితమని పేర్కొ ంది. భక్తుల మనోభావాలు దెబ్బతీసే ఈ తరహా చర్యలు ఆధ్యాత్మిక వాతావరణానికి విఘాతం కలిగిస్తు న్నాయని, తిరుమల క్షేత్రం భక్తి, ఆరాధనలకు నిలయమనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని తెలిపింది. ఇలాంటి వీడియోలు చిత్రీకరించేవారిని టీటీడీ విజిలెన్స్, సెక్యూరిటీ సిబ్బంది గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటుందని టీటీడీ గురువారం ఓ ప్రకటన ద్వారా హెచ్చరించింది.