TTD: అనుబంధ ఆలయాలపై టీటీడీ దృష్టి
ABN , Publish Date - Dec 21 , 2025 | 04:35 AM
తిరుమల శ్రీవారి ఆలయంతో పాటూ దేశంలోని అనుబంధ ఆలయాలపై ప్రత్యేక దృష్టి సారించాలని టీటీడీ నిర్ణయించింది.
విడిగా బడ్జెట్, ప్రత్యేకంగా కార్పస్ ఫండ్
తిరుపతి, డిసెంబరు 20 (ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవారి ఆలయంతో పాటూ దేశంలోని అనుబంధ ఆలయాలపై ప్రత్యేక దృష్టి సారించాలని టీటీడీ నిర్ణయించింది. ఆలయ నిర్వహణ కోసం ప్రతి గుడికీ ప్రత్యేకంగా కార్పస్ ఫండ్‌ను ఏర్పాటు చేయ నున్నారు. ఇందుకోసం ప్రతి ఆలయానికీ విడిగా వార్షిక బడ్జెట్‌ను రూపొందిం చనున్నారు. తదుపరి జరగబోయే పాలకమం డలి సమావేశంలో ఈ అంశంపై నిర్ణయం తీసుకోనున్నారు. టీటీడీకి ప్రస్తుతం దేశవ్యాప్తం గా 60 అనుబంధ ఆలయాలు న్నాయి. ఒక్కో ఆలయ నిర్వహణ కోసం ఏటా రూ.60 నుంచి రూ.70 లక్షల వరకు టీటీడీ ఖర్చు చేస్తోంది. భక్తుల సంఖ్య, ఆదాయంతో నిమిత్తం లేకుండా అన్ని అనుబంధ ఆలయాలకూ ఒకే విధంగా ఖర్చు చేయడం వల్ల కొన్ని చోట్ల కొరత ఏర్పడుతుంటే, కొన్ని ఆలయాల్లో అవసరానికి మించి వ్యయం చేస్తున్నట్టు గుర్తించారు. అలా కాకుండా ఆలయం స్థాయి, భక్తుల రాక, ఆదాయం, అవసరాలకు అనుగుణంగా ఖర్చు చేయా లన్న ప్రతిపాదన టీటీడీ దృష్టికి వచ్చింది. ఇందుకోసమే ప్రతి ఆలయానికీ విడిగా వార్షిక బడ్జెట్ రూపొందించాలని నిర్ణయిం చారు. 2026-27 బడ్జెట్ నుంచి ఈ విధానం అమల్లోకి తీసుకురావాలని ప్రయత్నిసు ్తన్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన కసరత్తు మొదలైంది. ప్రతి ఆలయం నుంచి అవసరమైన సమాచారాన్ని టీటీడీ సేకరిస్తోం ది. ఆలయానికి రోజువారీ వస్తున్న భక్తుల సంఖ్య ఎంత? ప్రత్యేక దినాల్లో ఎంతమంది భక్తులు వస్తున్నారు వార్షిక బ్రహ్మోత్సవాలు, పవిత్రోత్సవాల్లో భక్తుల సంఖ్య ఎంత? ఆలయానికి కార్పస్ ఫండ్ ఉందా? హుండీ ఆదాయం ఎంత వస్తోంది? ఏయే ఉత్సవాలు జరుగుతున్నాయి? వాటికయ్యే వ్యయం ఎంత? ఏటా ఆలయ నిర్వహణకు ఎంత ఖర్చు అవుతోంది.. అంటూ ప్రశ్నావళిని రూపొందించి ఆలయాలకు పంపించారు.
రూ.20 కోట్లతో ప్రతి ఆలయానికీ కార్పస్‌ఫండ్
ప్రతి ఆలయానికీ ఏడాదికి రూ.కోటి వ్యయం చేసేలా ఆదాయం ఉండాలని టీటీడీ భావిస్తోంది. కార్పస్ ఫండ్‌గా ప్రతి ఆలయానికి రూ.15 నుంచి రూ.20 కోట్లు సమకూర్చగలిగితే వడ్డీతోనే ఆలయ నిర్వహణ సజావుగా జరుగుతుందని అంచనా వేస్తున్నారు. కార్పస్ ఫండ్‌కు అవసరమైన మొత్తాన్ని స్థానికంగానే సమకూర్చుకోవాలని భావిస్తున్నారు. ఈ బాధ్యతను అనుబంధ ఆలయాల సలహా కమిటీలకు, అధికారులకు అప్పగిస్తారు. అనుబంధ ఆలయాలకు ఇప్పటికే ఉన్న జనరల్ అకౌంట్‌తో పాటు అదనంగా అన్నదాన అకౌంట్ కూడా తెరవాలని ఇటీవల సీఎం చంద్రబాబు సూచించిన నేపథ్యంలో ఆ ఏర్పాట్లు కూడా టీటీటీ చేపట్టనుంది. అనుబంధ ఆలయాలకు భక్తులిచ్చే విరాళాలు ఇప్పటివరకూ నేరుగా టీటీడీ ఖాతాలో జమవుతున్నాయి. ఇకపై ఏ ఆలయ ఆదాయం, విరాళాలు అదే ఆలయ అభివృద్ధికి ఖర్చు చేయాలని భావిస్తున్నారు.
ఈశాన్య భారతంలో శ్రీవారి తొలి ఆలయం
గువాహటిలో 25 ఎకరాలు కేటాయించిన అసోం ప్రభుత్వం
అసోం రాజధాని గువాహటిలో టీటీడీ నిర్మించదలచిన శ్రీవారి ఆలయానికి 25 ఎకరాలు కేటాయించేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. కామరూప్ మెట్రోపాలిటన్ జిల్లాలో 10.8 ఎకరాల భూమిని కేటాయించేందుకు గతంలోనే అంగీకారం తెలిపింది. అయితే సిల్చార్‌లో లేదా డిబ్రూగఢ్‌లో ఆలయం నిర్మించాలంటూ అసోం ప్రభుత్వ అదనపు ప్రధాన కార్యదర్శి కేకే ద్వివేది ఈ నెల 7న టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడికి లేఖ రాశారు. ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి టీటీడీ చైర్మన్ తీసుకెళ్లారు. రాజధానిలోనే టీటీడీకి 25 ఎకరాల భూమిని కేటాయించాలని కోరుతూ చంద్రబాబు 18న అసోం సీఎంకు లేఖ రాయగా సూత్రప్రాయంగా ఆమోదం తెలిపారు. ఈ క్రమంలో ఈశాన్య భారతంలో టీటీడీ ఆధ్వర్యంలో శ్రీవారి తొలి ఆలయ నిర్మాణ పనులను త్వరలోనే ప్రారంభించేందుకు అసోం ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటామని టీటీడీ చైర్మన్ తెలిపారు.