Suspension: టీటీడీలో నలుగురు అన్యమత ఉద్యోగుల సస్పెన్షన్
ABN , Publish Date - Jul 20 , 2025 | 05:05 AM
టీటీడీలో పనిచేస్తున్న మరో నలుగురు అన్యమత ఉద్యోగులను సస్పెండ్ చేశారు.
తిరుమల, జూలై 19(ఆంధ్రజ్యోతి): టీటీడీలో పనిచేస్తున్న మరో నలుగురు అన్యమత ఉద్యోగులను సస్పెండ్ చేశారు. క్వాలిటీ కంట్రోల్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బి.ఎలిజర్, బర్డ్ ఆస్పత్రి స్టాఫ్ నర్సు ఎస్.రోసీ, గ్రేడ్-1 ఫార్మసిస్ట్ ప్రేమావతి, ఎస్వీ ఆయుర్వేద ఫార్మసీలో పనిచేస్తున్న జి.అసుంతను సస్పెండ్ చేస్తున్నట్టు టీటీడీ శనివారం ప్రకటించింది. టీటీడీలో పనిచేస్తూ వీరు క్రైస్తవమతాన్ని అనుసరిస్తున్నారనే ఆధారాలను విజిలెన్స్ విభాగం సేకరించింది. వీటిని పరిశీలించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు.