TTD Donations: 11 నెలల్లో రూ.918.59 కోట్లు
ABN , Publish Date - Oct 22 , 2025 | 05:35 AM
తిరుమల శ్రీవారి ట్రస్టులకు విరాళాలు భారీగా పెరిగాయి. గడిచిన 11 నెలల్లో వివిధ ట్రస్టులకు రూ.918.59 కోట్లు విరాళాలు అందాయి.
శ్రీవారి ట్రస్టులకు విరాళాలు
తిరుమల, అక్టోబరు 21(ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవారి ట్రస్టులకు విరాళాలు భారీగా పెరిగాయి. గడిచిన 11 నెలల్లో వివిధ ట్రస్టులకు రూ.918.59 కోట్లు విరాళాలు అందాయి. టీటీడీలోని 11 ట్రస్టుల్లో అత్యధికంగా ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు రూ.338.80 కోట్లు రాగా, రెండవ స్థానంలో శ్రీవాణి ట్రస్టు నిలిచింది. ఈ ట్రస్టుకు రూ.252.83 కోట్లు అందాయి. ఇక, ఎస్వీ ఆరోగ్య వరప్రసాదిని స్కీంకు రూ.97.97 కోట్లు, ఎస్వీ ప్రాణదానం ట్రస్టుకు రూ.66.53 కోట్లు, ఎస్వీ గోసంరక్షణకు రూ.56.77 కోట్లు, విద్యాదానం ట్రస్టుకు రూ.33.47 కోట్ల విరాళాలు అందాయి. అలాగే బర్డ్ ట్రస్టుకు రూ.30.02 కోట్లు, సర్వశ్రేయా్‌సకు రూ.20.46 కోట్లు, వేదపరిరక్షణ ట్రస్టుకు రూ.13.87 కోట్లు, ఎస్వీబీసీ ట్రస్టుకు రూ.6.29 కోట్లు, స్విమ్స్‌కు రూ.1.52 కోట్ల చొప్పున విరాళాల రూపంలో అందాయి. ఈ 11 నెలల్లో ఆఫ్‌లైన్ ద్వారా రూ.339.20 కోట్లు విరాళాలుగా అందగా, ఆన్‌లైన్ ద్వారా 579.38 కోట్లు వచ్చాయి.
రెండురోజుల్లో హుండీ ద్వారా రూ.8.83 కోట్లు
తిరుమల శ్రీవారికి రెండురోజుల్లో హుండీ ద్వారా రూ.8.83 కోట్ల ఆదాయం లభించింది. శనివారం ఒక్కరోజే రూ.7.97 కోట్లు వచ్చింది. ఆదివారం రూ.3.86 కోట్లు ఆదాయం సమకూరింది. ఇక, ఆదివారం 84,017 మంది, సోమవారం 72,026 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా, ఈ రెండురోజుల్లో 53,401 మంది భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పించారు.