Share News

9 Crore Donation for PA Cottages Modernization: టీటీడీకి రూ.9 కోట్ల భారీ విరాళం

ABN , Publish Date - Nov 27 , 2025 | 05:11 AM

టీటీడీకి బుధవారం రూ.9 కోట్ల భారీ విరాళం అందింది. అమెరికాలో నివాసముంటున్న మంతెన రామలింగరాజు తన కుమార్తె మంతెన నేత్ర...

9 Crore Donation for PA Cottages Modernization: టీటీడీకి రూ.9 కోట్ల భారీ విరాళం

  • పీఏసీల ఆధునికీకరణకు అందజేసిన మంతెన రామలింగరాజు

తిరుమల, నవంబరు26(ఆంధ్రజ్యోతి): టీటీడీకి బుధవారం రూ.9 కోట్ల భారీ విరాళం అందింది. అమెరికాలో నివాసముంటున్న మంతెన రామలింగరాజు తన కుమార్తె మంతెన నేత్ర, అల్లుడు వంశీ గాదిరాజు పేరుపై ఈ విరాళాన్ని అందజేశారు. తిరుమలలోని యాత్రికుల వసతి సముదాయాల (పీఏసీలు) ఆధునికీకరణకు ఈ మొత్తం వినియోగిస్తారు. తిరుమలలోని పద్మావతి అతిథిగృహంలో దాతతో కలిసి టీటీడీ చైర్మన్‌ బీఆర్‌ నాయుడు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి, ఎంపీ అప్పలనాయుడు మీడియాకు ఈ వివరాలు తెలిపారు. 2012లో కూడా టీటీడీకి మంతెన రామలింగరాజు రూ.16.06 కోట్లు విరాళంగా ఇచ్చారని తెలిపారు. రామలింగరాజు మాట్లాడుతూ, తిరుమలతో తమ కుటుంబానికి ప్రత్యేక అనుబంధం ఉందన్నారు. తన ఇద్దరు తాతలతో పాటు చిన్నాన్న కనుమూరి బాపిరాజు టీటీడీ బోర్డు చైర్మన్లుగా పనిచేశారని చెప్పారు.

Updated Date - Nov 27 , 2025 | 05:11 AM