Share News

TTD: కల్తీ నిరోధానికి టీటీడీ చర్యలు

ABN , Publish Date - Dec 16 , 2025 | 02:55 AM

మార్కెటింగ్‌ విధానాన్ని సంస్కరించే పనిని టీటీడీ వేగవంతం చేసింది. కల్తీని నిరోధించి, నాణ్యత పెంచే లక్ష్యాలతో ఇప్పటికే కొత్త కొనుగోలు మాన్యువల్‌ను రూపొందించారు....

TTD: కల్తీ నిరోధానికి టీటీడీ చర్యలు

  • కొనుగోలు చేసే సరుకులకు ‘థర్డ్‌ పార్టీ సర్టిఫికేషన్‌’ తప్పనిసరి

తిరుమల, డిసెంబరు 15(ఆంధ్రజ్యోతి): మార్కెటింగ్‌ విధానాన్ని సంస్కరించే పనిని టీటీడీ వేగవంతం చేసింది. కల్తీని నిరోధించి, నాణ్యత పెంచే లక్ష్యాలతో ఇప్పటికే కొత్త కొనుగోలు మాన్యువల్‌ను రూపొందించారు. టీటీడీ ప్రస్తుతం దాదాపు 300 రకాల సరుకుల కొనుగోలు కోసం రూ.600 కోట్ల నుంచి రూ.700 కోట్ల వరకు ఏటా ఖర్చు చేస్తోంది. కొనుగోళ్లలో అవినీతి అంశాలు ఒక్కటొక్కటిగా వెలుగులోకి వస్తుండడంతో అనేక చర్యలకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ఇకపై సరుకుల కొనుగోలకు థర్డ్‌ పార్టీ సర్టిఫికేషన్‌ తప్పనిసరి చేస్తూ టీటీడీ నిర్ణయం తీసుకుంది. అన్ని కొనుగోళ్లలోనూ తప్పసనిసరిగా ఎఫ్‌ఎ్‌సఎ్‌సఏఐ నిబంధనలు పాటించాలని సూచించింది.

Updated Date - Dec 16 , 2025 | 02:55 AM