TTD: శ్రీవాణి టికెట్లకు ముందే టోకెన్లు
ABN , Publish Date - Aug 08 , 2025 | 06:20 AM
శ్రీవాణి టికెట్ల జారీలో నిరీక్షణ సమయాన్ని తగ్గించేందుకు టోకెన్ విధానాన్ని టీటీడీ ప్రారంభించింది. తెల్లవారుజాము నుంచి ఉదయం 8 గంటలకు టికెట్లు కేటాయించేదాకా...
తిరుమల, ఆగస్టు7(ఆంధ్రజ్యోతి): శ్రీవాణి టికెట్ల జారీలో నిరీక్షణ సమయాన్ని తగ్గించేందుకు టోకెన్ విధానాన్ని టీటీడీ ప్రారంభించింది. తెల్లవారుజాము నుంచి ఉదయం 8 గంటలకు టికెట్లు కేటాయించేదాకా క్యూలైన్‌లో ఉండే అవసరం లేకుండా వచ్చినవారికి వచ్చినట్టుగా అన్నమయ్య భవనం ఎదురుగా ఉండే శ్రీవాణి కౌంటర్ వద్ద టోకెన్లు ఇస్తున్నారు. ఈ సమయంలోనే భక్తుల ఆధార్ జిరాక్స్‌పై సంతకం చేసి స్టాంప్ వేస్తారు. టోకెన్లు పొందినవారు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 1.30లోగా ఎప్పుడైనా కౌంటర్ వద్దకు వచ్చి టికెట్ కొనుగోలు చేయచ్చు. సాయంత్రం 4.30కి వీరిని దర్శనానికి అనుమతిస్తారు. ఇందువల్ల క్యూలో వేచివుండే అవసరం లేకుండా పోయింది. రానున్న రోజుల్లో టోకెన్ బదులుగా చేతికి కంకణం వేసే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం.
మరో 400 టికెట్లు
ప్రస్తుతం ఆన్‌లైన్ ద్వారా 500, ఆఫ్‌లైన్ ద్వారా ఎయిర్‌పోర్టులో 200, తిరుమలలో 800 శ్రీవాణి టికెట్లను జారీ చే స్తున్నారు. భక్తుల నుంచి డిమాండ్ ఉండడంతో ఆప్‌లైన్‌లో మరో 400 టికె ట్లు కేటాయించే ఆలోచనలో ఉంది.